లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ లో ఓపెన్ కానున్న మొట్టమొదటి థియేటర్…

సినిమా ప్రేమికులకు శుభవార్త… కరోనా నేపథ్యంలో మూత పడిన మల్టిప్లెక్సు లు మరియు థియేటర్లు ఎట్టకేలకు తిరిగి తెరుచుకుంటున్నాయి. సుమారు ఎనిమిది నెలలు తరువాత తెరుచుకోనున్న మల్టీప్లెక్స్  మరియు థియేటర్ లు కేంద్ర హోం శాఖ సూచించినట్లుగా కేవలం 50 శాతం సీట్లకు మాత్రమే టిక్కెట్లను రిలీజ్ చేస్తున్నారు. కేవలం రెండు గంటల ముందు మాత్రమే ఆన్లైన్ లో టికెట్స్ బుకింగ్ ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇంతకముందు లాగా కాకుండా ఇపుడు కేవలం రోజుకి 3 షోలను మాత్రమే ప్రదర్శించనున్నారు. క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ తో ప్రస్తుతం మల్టీప్లెక్సులు తిరిగి ప్రారంభం  అవ్వనున్నాయి. 

లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ లో ఓపెన్ కానున్న మొట్టమొదటి థియేటర్...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి నిర్మించిన AMB సినిమాస్ ఈ నెల 4వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నది. కేంద్ర హోం శాఖ సూచించిన అన్ని నిబంధనలను దృష్టిలో పెట్టుకుని  AMB సినిమాస్ తిరిగి ప్రారంభం అవ్వనున్నది. ఇది సినిమా లవర్స్ కి ఒక శుభవార్త అనే చెప్పాలి.