న్యూస్

Guppedentha Manasu Jan 26 Today Episode: అయ్యో వసు… రిషికి ఎందుకు నో చెప్పావ్.. పాపం రిషి నేనెప్పుడూ ఒంటరి వాడినే అని ఫీల్ అవుతూ ఏమి చేస్తాడో చుడాలి ..?

Share

Guppedentha Manasu Jan 26 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ వస్తుంది.మంచి లవ్ స్టోరీతో ముందుకు సాగుతున్న సీరియల్. ఒక్కసారిగా మహేంద్ర ఆరోగ్యం దెబ్బతినడంతో విషాదంలో మునిగిపోయిందిన్.గత ఎపిసోడ్‌లో మహేంద్ర నా సంతోషం జగతి అని చెప్పడంతో రిషి ఆలోచనలో పడతాడు ‘డాడ్ సంతోషం కోసం ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది.. డాడ్ సంతోషం కంటే నాకేం అవసరం లేదు’ అంటూ వసునూ కలుస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ ధరణి, జగతి ఫోన్ మాట్లాడడంతో ఓపెన్ అవుతుంది. జగతి ‘ధరణీకి ఫోన్ చేసి మహేంద్రకి పెట్టాలిసిన డైట్ గురించి చెప్పి మహేంద్ర ఫుడ్ విషయం మొత్తం నువ్వే చూసుకోవాలి.. ప్లీజ్ ధరణీ’ అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. ‘నేను చూసుకుంటాను చిన్న అత్తయ్యా..’ అంటూ ధరణి ఫోన్ పెట్టేస్తుంది.

Sreeja: శ్రీజ విడాకుల పుకార్ల విషయం లో మరొక పెద్ద సాక్ష్యం దొరికింది ?

Guppedentha Manasu Jan 26 Today Episode: గౌతమ్ ఇంటికి తీసుకురాబోయే ఆ గెస్ట్ ఎవరబ్బా?

ఇంతలో అటుగా వస్తున్న గౌతమ్‌ ధరణి మాటలు విని ‘వదినా మీరు మాట్లాడేది డైటీషన్నే కదా..? చూశారా ఎలా కనిపెట్టేశానో..’ అంటాడు. అందుకు ధరణి అవును అన్నట్లుగా తలాడించడంతో వదినా ఈ సంక్రాంతి పండగకి ఓ ఫ్రెండ్‌ని ఇంటికి భోజనానికి పిల్లుద్దాం అనుకుంటున్నాను మీకు ఓకేనా?’ అంటాడు. ‘ఓకే రిషి.. ఎవరా ఫ్రెండ్?’ అంటుంది ధరణి.వసుధర అంటాడు గౌతమ్. ధరణి షాక్ అయ్యి ‘వసుధర అంటే.. దేవయానికి అత్తయ్యకు పడదు..’ అని చెప్పడంతో ‘ఎందుకు పడదు వదిన.రిషి గాడికి లైన్ వేస్తుందనా? అయినా మన రిషి గాడి గురించి తెలిసిందే కదా వదినా.. వాడి కోపానికి ఏ అమ్మాయి అయినా వాడితో మాట్లాడుతుందా ఏంటి.? సరేలే వదినా సంక్రాంతికి వసుధర ఇక్కడికి వస్తే సరే లేదంటే నేనే వాళ్లింటికి భోజనానికి వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.‘ఈ గౌతమ్ దూకుడు చూస్తుంటే రిషికి తలనొప్పి కావడం పక్కా అనిపిస్తోంది’ అనుకుంటుంది ధరణి మనసులో..

AP New Districts: ఏపిలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఇవే..
రిషికి నో చెప్పిన వసు… కోపంలో రిషి ఏమి. చేయనున్నాడు.?

సీన్ కట్ చేస్తే.. రిషి కారు ఓ చోట ఆపి వసుధరా నాకో హెల్ప్ చెయ్యాలి.. ఇది నువ్వు మాత్రమే చెయ్యగలవు’ అంటూ రిషి ఏదో అంటాడు.సారీ సార్ నేను ఈ పని చెయ్యలేను సార్ అంటే ‘వాట్.. ఏం అటున్నావ్’ అని రిషి షాక్ అవుతాడు.సారీ సార్.. ఇది మీరు నన్ను అడగాల్సింది కాదు.దీనికి సాయం అనే మాట సరిపోదు సార్. నా స్థాయికి మించినది మీరు అడిగారు సార్’ అంటూ వసు మళ్లీ నో అంటుంది.రిషి ఆవేశంగా నేను నీకు చాలా సార్లు హెల్ప్ చేశాను.. ఏరోజు కూడా నాకు ఈ హెల్ప్. చేయమని అడగలేదు అని కోపంతో కారు దిగిపోయి.. ‘నాకు తెలుసు నాకు ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు.. నేను ఎప్పుడూ ఒంటరి వాడ్నే అంటాడు.

Akhanda: “అఖండ” సినిమా ఆ ఊరు వాళ్ళు అందరూ కలిసి స్పెషల్ షో వేశారు అని తెలుసుకుని ఆ ఊరు బయలుదేరిన బాలయ్య !
సంక్రాతి సంబరాల్లో ఫణింద్ర కుటుంబం :

ఇక గౌతమ్, మిగిలిన వాళ్లంతా టిఫిన్ తింటూ ఉంటే ఫణేంద్ర ఇలా అంటాడు.మన మహేంద్ర పెద్ద సమస్య నుంచి బయటపడ్డాడు కాబట్టి ఈ సారి పండుగ బాగా ఘనంగా చేద్దాం అంటాడు. మహేంద్ర మాత్రం మనసులో జగతి లేని ఈ ఇంట్లో నాకు పండుగ ఏంటీ?’ అని అనుకుంటాడు.సర్లే గాని రిషి ఎక్కడా?’ అని గౌతమ్ అనేసరికి.. ఇంతలో రిషి కారు జగతి ఇంటి ముందు ఆగుతుంది. వసు మాత్రం మనసులో సార్‌కి కోపం వచ్చి ఉంటుందా? ఆయన చెప్పిన పని నా వల్ల కాదు అన్నానని అనుకుంటుంది. ఇంతలో జగతి కాఫీ తెచ్చి పక్కనే కూర్చుంటుంది.గుమ్మం దగ్గర ఉన్న రిషి లోపలికి రావచ్చా మేడమ్?’ అంటాడు. రిషిని చూసి కంగారు పడిన జగతి పైకి లేచి ‘రండి సార్ రండి అంటూ వసు సార్‌కి కాఫీ తీసుకుని రా’ అంటూ పంపిస్తుంది.అలాగే వసు కూడా వంటగదివైపు వెళ్తుంది. ‘కాఫీ కోసం రాలేదు మేడమ్ మా డాడ్ విషయంలో నాకో హెల్ప్ చెయ్యాలి. ఆయన సంతోషంగా ఉండాలి అందుకు మీరొక పని చెయ్యాలి మేడమ్’ అంటాడు.

జగతిని ఇంటికి రమ్మని పిలిచిన రిషి… జగతి వెళ్తుందా..?

‘చేస్తాను సార్ నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోమని కాకుండా ఏం చెప్పినా చేస్తాను సార్’ అంటుంది జగతి చాలా ఎమోషనల్‌గా.మేడమ్ నేను ఏం చెప్పినా మీరు కాదు అనకూడదు.మా డాడ్ సంతోషం కోసం మీరు ఇక్కడ నుంచి వెళ్లాలి అలాగే ఇక్కడ నుండి మీరు మా ఇంటికి రావాలి’ అంటాడు రిషి. ‘జగతి ఒక పక్క షాక్. అవుతూనే సార్’ అంటుంది.మరోపక్క అ మాట విని సంతోషంగా..‘సార్ నేను.. ఆ ఇంటికి నా ఇంటికి ..’ అని జగతి ఎమోషనల్ అవుతుంది. ‘అవును మేడమ్ మా ఇంటికి రావాలి.మా డాడ్ సంతోషం కోసం,మా డాడ్ ఆనందం కోసం మీరు ఆ ఇంటికి రావాలి’ అంటాడు. ఇక జగతి ఆనందానికి అవధులే ఉండవు.అలాగే జగతి మేడంతో పాటు వసు నువ్వు కూడా మా ఇంటికి రావాలి అని చెప్పి బయట కారులో వైట్ చేస్తా రండి అని వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Tdp : ఆ జిల్లాలో ఏకగ్రీవ లను అడ్డుకున్న గాని ప్రజల నాడిని అడ్డుకోలేక పోయారు టి.డి.పి వాళ్లు..!!

sekhar

Pooja hegde: పూజా హెగ్డే గూరూజీకే షాకిచ్చిందా..?

GRK

Decoration: ఇంట్లో  అలంకారం కోసం వీటితో తయారు చేయబడిన వస్తువులు అస్సలు ఉండకూడదు.. అలాగే అక్వేరియం కూడా ??

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar