Guppedentha manasu: పాపం ఫ్రెండ్ అని కూడా చూడకుండా గౌతమ్ ను నడిరోడ్డుపై దించేసిన రిషి.. !!

Share

Guppedentha manasu: ఎన్నో ప్రశ్నలతో, ప్రేక్షకుల ఊహాగానాలకు కూడా అందకుండా సాగుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. గడిచిన ఎపిసోడ్ లో వసుధారని ఇంట్లోంచి పంపించేయమని రిషి జగతి మేడం కు చెప్తాడు. రిషి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని జగతి వసూని ఇంట్లో నుంచి బయటకు పంపే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వసు ఇచ్చిన కాఫీని పడవేయడం,మీతో పాటు నేను కూడా కాలేజికి వస్తామేడం అన్నా పట్టించుకోకుండా జగతి వెళ్లిపోవడం వంటి పనులు చేస్తుంది జగతి. జగతి మేడం ప్రవర్తన తలుచుకుని వసు డల్ గా బయట నిలబడి ఉంటే రిషి-గౌతమ్ కారులోకి అక్కడకు వస్తారు..

Bigg Boss 5 Telugu: నా మీద ఇంత నెగిటివిటీలో కూడా బయట నిలబడింది ఆ వ్యక్తే, షణ్ముక్ షాకింగ్ కామెంట్స్..!!
కారులో నుంచి గౌతమ్ ను దించేసిన రిషి..ఎందుకంటే..?

ఇక ఈరోజు ఎపిసోడ్ లో వసునూ చూసి గౌతమ్ ఆగకుండా మాట్లాడమే కాకుండా ఏంటి వసుధారా ఇంట్లోకి రమ్మని కూడా పిలవ్వా అని అడుగుతాడు. తప్పని పరిస్థితుల్లో రండి అన్న వసుతో హా వద్దులే అంటాడు రిషి. తరువాత వసుధారతో మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఓ షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నాం కదా అది ఎక్కడివరకూ వచ్చింది అని రిషి అడగడంతో ఇంకా పూర్తైనట్టు లేదని చెబుతుంది వసుధార. ఇంతకీ జగతి మేడం నేను చెప్పిన పని మొదలెట్టిందో లేదో అని ఆలోచిస్తూనే బయట కారు లేదు మేడం ఇంట్లో లేరా అన్న రిషితో మేడం కాలేజీకి వెళ్లారని చెబుతుంది. మరి నువ్వెలా వస్తావని అడిగితే నేను ఇంకా కార్ లలో తిరిగే సౌకర్యాలకు అలవాటు పడలేదులే సార్ అంటుంది.సరే తమతో రమ్మని అడగడంతో వసు బయలుదేరుతుంది. అలా ముగ్గురు కారులో వెళ్తుంటే మధ్యలో అయ్యో వాటర్ లేవు అని గౌతమ్ అంటే వసు బాటిల్ ఇచ్చే ప్రయత్నం చేసినా రిషి అడ్డుకుంటాడు. ఆ తరువాత మా చిన్నప్పటి విషయాలు రిషి ఏమైనా నీకు చెప్పాడా అంటూ గౌతమ్ సందడిగా మాట్లాడుతునే ఉంటాడు.రిషి ఏం చేసినా నాకు చెప్పకుండా చేసేవాడు, నేను మాత్రం చెప్పే చేసేవాడిని అంటాడు. వసు..నీ కుటుంబం గురించి చెప్పు అనడంతో రిషి చిరాకు పడతాడు.మళ్ళీ ఆపకుండా గౌతమ్ మాట్లాడుతూనే ఉంటే గౌతమ్ ని కార్లోంచి దించేసి క్యాబ్ బుక్ చేసి అందులో పంపించేస్తాడు రిషి.

Bigg Boss 5 Telugu: సిరి, జెస్సి తర్వాత బిగ్ బాస్ హౌస్ లో నాకు నచ్చే కంటెస్టెంట్ అతన్నే షణ్ముక్ వైరల్ కామెంట్స్..!!
గౌతమ్ ప్రేమకి అడ్డుగా వస్తున్న రిషి..!

వీడు అసలు ఏ ఒక్క అవకాశం కూడా దొరకనివ్వడం లేదని మనసులో బాధపడతాడు గౌతమ్.ఇక సీన్ కట్ చేస్తే కాలేజీలో తన క్యాబిన్లో కూర్చున్న జగతి రిషి చెప్పిన మాటలు, తాను వసుధార పట్ల ప్రవర్తిస్తున్న తీరు గుర్తుచేసుకుని బాధపడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర జగతి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనడంతో మహేంద్ర నా మూడ్ ఏమి బాలేదంటుంది. మీ మూడ్ ని నేను రిపేర్ చేస్తాకదా అంటాడు.అయినాగానీ జగతి అక్కడి నుంచి లేచి క్యాంటీన్ కి వెళ్లిపోతూ ప్లీజ్ అక్కడికి మాత్రం రావొద్దంటుంది. ఈలోపు వసుధార ఎదురై మేడం అనడంతో ఆగిన జగతి సారీ వసు అని మనసులో అనుకును మళ్ళీ ఏమి పట్టనట్లు వసు పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  

జగతి ప్రవర్తన గురించి అయోమయంలో పడ్డ వసూ,మహేంద్ర.. !

ఇంతలో మహేంద్ర ఎదురుపడడంతో మేడంకి ఏమైంది టిఫిన్ తినలేదు, లంచ్ తెచ్చుకోలేదని మహేంద్ర చెప్పడంతో వసు ఆలోచనలో పడుతుంది. ఇక తన క్యాబిన్లో కూర్చున్న రిషి ఆలోచిస్తూనే జగతి మేడంని రమ్మని కబురు పెడతారు. జగతి మేడం నీడలో వసుధార మంచితనం పెద్దమ్మకి కనిపించడం లేదు. అందుకే వసుకి సంబంధించి మంచి నిర్ణయమే తీసుకున్నా అని తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు. వసుధార గురించి నేను చెప్పింది ఏం చేశారని అడిగిన రిషికి..జగతి సమాధానం చెప్పేలోగా వసుధారని హాస్టల్లో అడ్మిట్ చేసే ఫాం తీసి జగతి ముందు పెడతాడు.అది చూసిన జగతి వసు మీ దగ్గరకి వచ్చి అడుగుతుంది అప్పుడు ఈ ఫార్మ్ ఇవ్వండి అంటుంది.మీరు నాకు చెప్పిన పని త్వరలోనే అయిపోతుందంటుంది జగతి. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార షార్ట్ ఫిలిం గురించి మీరు చెబితే సందేహాలు వస్తే అడుగుతాను అంటుంది వసు.రిషిని ఉద్దేశించి నేను నాకిచ్చిన పని మీద శ్రద్ద పెడతాను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోతుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.


Share

Related posts

Andhra Pradesh : ఏపీ , తెలంగాణ‌… హాట్ టాపిక్ ఏంటో తెలుసా?

sridhar

Hyderabad: మీరు హైద‌రాబాద్ లో ఉంటున్నారా… ఈ మూడు విష‌యాలు తెలుసుకోండి

sridhar

వాళ్లే నా బలం.. వాళ్లు లేకపోతే..? రష్మిక మందన్న

Varun G