Guppedentha manasu: వసు విషయంలో ఎక్సట్రాలు చేయొద్దని గౌతమ్ కి వార్నింగ్ ఇచ్చిన ఈగోమాస్టర్..!

Share

Guppedentha manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతుంది.కధ ఎటువంటి మలుపు తిరుగుతుందో అని అందరిలోనూ ఉత్కంఠ మొదలయింది నిన్న మంగళవారం రెస్టారెంట్లో ముగిసిన ఎపిసోడ్ మళ్ళీ ఈరోజు కూడా రెస్టారెంట్లోనే ఓపెన్ అయింది. రెస్టారెంట్ లో పని ముగుంచుకుని ముగ్గురూ కలసి కారులో బయలుదేరుతారు.గౌతమ్ మాత్రం ఎంచక్కా వసుధారతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే మధ్యలో వీడు విలన్ లా వచ్చాడే అని మనసులో తిట్టుకుంటాడు. అలాగే వసుధార కూడా మనసులో థ్యాంక్యూ రిషి సర్ సరైన సమయానికి వచ్చి గౌతమ్ సార్ నుంచి నన్ను కాపాడారు అనుకుంటుంది. అలాగే రిషి కూడా మనసులో గౌతమ్ కు మంచి సమయం చూసుకుని అర్థమయ్యేలా చెప్పాలి లేదంటే ఇంకా ఎక్కువ చేసేలా ఉన్నాడని అనుకుంటాడు. వసుని జగతి ఇంటిదగ్గర దించేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.


Allu arjun – Nani: ‘పుష్ప’ రాజ్ దెబ్బకు ‘శ్యామ్ సింగ రాయ్’ తట్టుకోలేకపోయాడా..?

వసుధారకు క్లాస్ పీకిన జగతి :

 

ఇంటికి వచ్చిన వసుధార రిషి గురించి చెబుతుంటే మనం మన ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉండాలి.కేవలం మాటలు మాత్రమే కాదని క్లాస్ పీకుతోంది జగతి. సరేగాని షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ వర్క్ చేశావా? వనభోజనాలు, ఉయ్యాలలు, మెసేజ్ లు, కబుర్లు ఇవేనా అని మనసులో బాధపడుతూనే క్లాస్ పీకుతోంది జగతి.ఇంతకు ముందులా చదువుపై, జీవితంపై శ్రద్ధ లేదు అంటుంది. నీ క్రమశిక్షణ , పట్టుదల అన్ని కూడా ఉప్పులా కరిగిపోతున్నాయి అంటుంది. నువ్వు రెస్టారెంట్ డ్యూటీ అయిపోగానే ఇంటికి వస్తే బావుంటుంది. ఇష్టం వచ్చినప్పుడు వచ్చే దాన్ని ఇల్లు అనరు అనేసి, నేను తినేశాను, నువ్వు వంట చేసుకుని తిను అనేసి కోపంగా డోర్ వేసుకుని గదిలోకి వెళ్లి బాధపడుతుంది. సారీ వసు.. రిషి చెప్పినట్టుగా నిన్ను ఇంట్లోంచి పంపించేయడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదంటుంది.ఇంకా వసుధార కూడా మేడం ప్రవర్తన తలుచుకుని బాధపడుతుంది.

 

వసు జోలికి వెళ్లొద్దు అని గౌతమ్ కు వార్నింగ్ ఇచ్చిన రిషి :

 

మరోవైపు కారులో వెళ్తున్న గౌతమ్ ఇంత సైలెంట్ గా ఉండడం నావల్ల కాదురా బాబు పాటలు పెడతా అని గొడవ పడడంతో కారు రోడ్డుపక్కన ఆపేసి కిందకు దిగి మాట్లాడుకుంటారు. వసుని ఈ టైమ్ లో కలిసే అవసరం ఏంటి అసలు? ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు అంటాడు. దానికి సమాధానంగా గౌతమ్ రోడ్డుమీద యాక్సిడెంట్ తో యాక్సిడెంటల్లీ కలిశాం అంతేగాని నేను వెళ్లి ఆమెను పరిచయం చేసుకున్నానా అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడు గౌతమ్. నీ స్టూడెంట్ అని తెలియకముందే నాకు పరిచయమైంది..దీనికి నువ్వెందుకు ఫీలవుతున్నావ్ అంటాడు గౌతమ్. వసుధారకంటూ ఒక గోల్ ఉంది, తనని డిస్ట్రబ్ చేయకు, వసుధార తెలివైన అమ్మాయి.తను అధ్బుతాలు చేస్తుంది నీ మైండ్ లో ఏమైనా ఉంటే తీసెయ్ అంటాడు..సీన్ కట్ చేస్తే ఫణీంద్ర-మహేంద్ర-గౌతమ్ ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటుండగా వసుధార మహేంద్రకు కాల్ చేసి ఏం జరిగిందో చెబుతుంది.నేను ఏమి జరిగిందో తెలుసుకుంటా అంటాడు మహేంద్ర. వీళ్ళ మాటలు అన్ని రిషి వింటాడు.

 

వసునూ హాస్టల్ కి వెళ్లామన్న జగతి :

 

మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వసుధారా మేడం ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో డైరెక్ట్ గా అడుగుతా అని అడిగేస్తుంది. అప్పుడు ఓపెన్ అయిన జగతి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాలి వసు అని చెబుతుంది.కారణాలు అడగొద్దు, హాస్టల్ కి వెళ్లిపో అంటుంది.నేను చేసిన తప్పేంటి అని అడిగితే.. తప్పొప్పులు అనవసరం వెళ్లిపో అన్నాను వెళ్లిపో అంటుంది.వసుధారా మళ్లీ అడగడంతో రిషి పంపించమన్నాడు అని చెబుతుంది జగతి.దానితో షాక్ అయిన వసుధారా అవునా..అయితే రిషి సర్ తోనే తేల్చుకుంటా అని అక్కడి నుంచి కోపముగా వెళ్లిపోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా జగతి కల కంటుంది. కలలో నుంచి తేరుకున్న వసు ఇదంతా కలా..అనుకుంటుంది. మళ్ళీ వసు సమాధానం చెప్పండి మేడం అని అడిగితే కాసేపు నన్ను వదిలెయ్ ప్లీజ్ అనేసి జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


Share

Related posts

విమానయానంలో 368 ఉద్యోగాలు..! వివరాలివే..!!

bharani jella

బ్రేకింగ్: అంతర్వేది ఘటనపై సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

Vihari

Interuptions: వృత్తి  పరంగా ఎదురయ్యే ఆటంకాలు,మొండి  బాకీలు వసూలు కావడానికి..  ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తుంది!!

siddhu