Guppedentha manasu:రిషి ఎందుకు వసుధారను జగతికి దూరం చేస్తున్నాడు..?

Share

Guppedentha manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతుంది. రిషి వసుధారను ప్రేమిస్తున్న అనే విషయం చెబుతాడేమోనని జగతి మేడం అనుకుంటే రిషి మాత్రం వసుధారని మీ ఇంటి నుంచి పంపించేసెయండి అని జగతికి షాక్ ఇస్తాడు.ఈ విషయం నేను చెప్పానని వసుధారకు తెలియకూడదంటాడు రిషి. తను బాధపడుతుందా, మీరు బాధపడతారా అని నేను ఆలోచించను అంటాడు రిషి…

Balakrishna: మంచి స్పీడ్ మీద ఉన్న బాలయ్య…హోస్ట్ గా మరో టాప్ షోకి.??
రిషి జగతి మేడంతో అన్నా మాటలు వసుధార వింటుందా??

సరిగ్గా అదే  సమయానికి మహేంద్ర, వసుధార అక్కడకు వచ్చి నించుంటారు.అప్పేడే వాళ్లని చూసి మాట మార్చిన రిషి మేడం స్టోరీ బోర్డ్ కరెక్షన్ చేసి ఇవ్వండని చెబుతాడు. మేడం మీకు ఇచ్చిన సూచనలు మీరు పాటిస్తారనే అనుకుంటున్నా అని ఇండైరెక్ట్ అనేసి అక్కడినుంచి వెళ్లిపోతాడు. మేడం…రిషి సర్ స్టోరీ బోర్డ్ గురించి ఏదైనా కొత్త కాన్సెప్ట్ చెప్పారా అని అడిగి జగతి మేడం ను వసు అడగగా..హా ఆవును సార్ కొత్త కాన్సెప్ట్ చెప్పారంటుంది జగతి. ఎలా ఉంది కొత్త  కాన్సెప్ట్ అని అడిగితే చాలా బావుందని చెబుతుంది జగతి. 

Balakrishna: మంచి స్పీడ్ మీద ఉన్న బాలయ్య…హోస్ట్ గా మరో టాప్ షోకి.??

డాక్టర్ కి చూపించుకోమని వసుదారకు సలహా ఇచ్చిన రిషి :

వసు కుంటుకుంటూ నడవడం చుసిన రిషి అన్నింటినీ ఈజీగా తీసుకుంటావ్, నొప్పిగా ఉందా అని వసుధారని అడుగుతాడు. అలాగే గోళీలను దాచుకున్నావ్ సరే వాటిని బ్యాగ్ లో వేసుకుని తిరగడం ఎందుకు? గోళీలకు సెంటిమెంట్ ఏమైనా ఉందా అంటాడు. ఆ సౌండ్ బావుంటుందని పెట్టుకున్నా అంటుంది వసు. అ తర్వాత తన జుట్టుకు ముడేసుకున్న టై తీసి వసు రిషికి ఇస్తుంది. ఈ టైని కూడా గోడకు అంటించి దానిపై డేట్ రాసి జ్ఞాపకం అనుకోలేదు..థ్యాంక్స్ అంటాడు రిషి. ఐడియా బావుంది సర్ అంటుంది వసుధార. వసుధారా ప్రతిసారీ పడిపోతుంటావ్ కదా డాక్టర్ కి చూపించుకో అనేసి అక్కడినుండి వెళ్లిపోతాడు.

బొమ్మ గీసే పనిలో పడ్డ గౌతమ్… ఇంతకీ ఎవరి బొమ్మ గిస్తాడో?

మరోవైపు బొమ్మ గీసే పనిలో పడతాడు రిషి ఫ్రెండ్ గౌతమ్.  పెద్ద పెయిటింగ్ సెటప్ పెట్టవే? ఏంటి విషయం అని రిషి అడిగితే బొమ్మ గీస్తాచూడు అది చూసి నీ కళ్లు తిరుగుతాయి అంటాడు. అందమైన అమ్మాయి బొమ్మ గీస్తున్నా కానీ అది ఎలా ఉండాలో చెప్పమంటాడు రిషిని గౌతమ్. రిషి వసుధారని ఊహించుకుంటూ చెబుతాడు నీకు పోలిక కూడా చెప్పడం రాలేదేంట్రా అని, అయిన అమ్మాయిల గురించి తెలియని నిన్ను అందం గురించి అడిగా చూడు నాది బుద్ధి తక్కువ అనేసి బొమ్మ గీస్తాడు గౌతమ్.

జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న రిషి, వసుధారా :

రిషి రాత్రి నిద్రపోకుండా మెట్లపై కూర్చుని మౌత్ ఆర్గాన్ వాయించుకుంటాడు.అది చుసిన మహేంద్ర ఇంకా పడుకోలేదా, మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అని అనుకుంటాడు.మరోపక్క గోళీలు, నెమలీకను ఫొటో తీసి రిషికి పంపిస్తుంది. ఆ ఫొటో చూసిన రిషి ఫోన్ చేయాలా.. వద్దా అనే ఆలోచనలో పడతాడు. అలాగే రిషి ఇచ్చిన గోళీలు చూసి వసుధార మురిసిపోతుంది.

వసుధారను జగతి ఇంటి నుంచి పంపించేస్తుందా?

కాలేజ్ లో రిషి అన్నా మాటలు తలుచుకుని జగతి బాధపడుతుంటుంది. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించమన్నాడు? అయినా నా ఇంటి నుంచి వెళ్ళిపో అని వసుకి నేనెలా చెప్పగలను, నావల్ల అవుతుందా..అయినా ఎప్పుడూ నేను ఒంటరిదాన్నే కదా అని బాధపడుతుంది. ఈలోపు వసుధార.. పిక్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అనుకుని గుడ్ నైట్ అని రిషికి మెసేజ్ పెట్టేసి బయటకు వచ్చి జగతి మేడం అలా కూర్చుని ఉండడం చూస్తుంది. ఈ టైమ్ లో నిద్రపోకుండా ఏం చేస్తున్నారని జగతి మేడంను అడుగుతుంది.దానికి జగతి మేడం వసూ నేను ఓ మాట చెబుతా వింటావా అంటుంది.. మీరు చెబితే వినకుండా ఉంటానా అంటుంది వసుధార. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.జగతి చెప్పిన మాట విని వసుధారా హాస్టల్ క్ వెళుతుందా… లేదా అనేది తరువాత ఎపిసోడ్ లో చూద్దాం. !

Guppedentha manasu, Dec, latest episode, star maa, rushi, vasundhra,


Share

Related posts

Sharwanand: ఇదే జరిగితే టాలీవుడ్‌లో శర్వానంద్ క్రేజ్ మొత్తం పడిపోయినట్టే..!

GRK

జగన్ మాదిరిగానే ఆ విషయంలో అలర్ట్ అవుతున్న కేసీఆర్..??

sekhar

Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!

sekhar