NewsOrbit
న్యూస్

Karthika Deepam: సీన్ లోకి రత్నసీత… ఇక మోనితకు చుక్కలు కనపడడం గ్యారంటీ.. !

Karthika Deepam: ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన కార్తీక దీపం గత ఎపిసోడ్ లో సౌందర్య కుటుంబంపై మోనిత పగతో రగిలిపోయి, నేనేంటో వీళ్లకి చూపిస్తాను అంటూ శ్రావ్య కొడుకు దీపుగాడ్ని మాయం చేస్తుంది.దాంతో శ్రావ్య మోనిత మీద అనుమానంతో మోనిత కాళ్ల మీద పడి ఏడుస్తు ‘నా బాబుని నాకు ఇచ్చెయ్ మోనితా.. ప్లీజ్..’అంటూ బతిమిలాడుతుంది. దాంతో శ్రావ్య బాధను చూసి మోనిత కూడా కరిగిపోయి ‘ఇప్పుడు అర్థమైందా శ్రావ్యా.. కన్న ప్రేమ ఎలా ఉంటుందో అని వెళ్లు.. నా బెడ్ కింద దాచాను నీ కొడుకుని.. వెళ్లి తెచ్చుకో’ అంటుంది. శ్రావ్య పరుగు పరుగున మోనిత రూమ్ లోకి వెళ్తుంది. .శ్రావ్య వెళ్లగానే.. మోనిత.. సౌందర్యతో పొగరుగా చూస్తూ సారీ అత్తయ్యగారు.. తప్పు అయిపోయింది.. అత్తగారి ఎదురుగా కూర్చోకూడదు కదా.. క్షమించండి..’ అంటూ ఓవర్ చేస్తుంది.ఏంటి ఆంటీ ‘ఎలా ఉంది ఆంటీ నేను ఇచ్చిన షాక్ ఇప్పుడు తెలిసిందా తల్లిప్రేమ.మీకు ఎలాగో పెద్ద మనవడు కనిపించడం లేదని బాధ కలిగింది కానీ చిన్న మనవడి మీద లేదు కదా. వాడు కూడా మీ మనవడే అని తెలియట్లేదా?’ అంటూ కళ్లు ఎగరేస్తుంది.

Musquitos : దోమల బాధ నుండి బయట పాడటానికి,ఇంట్లో ఈ వాసనలు వచ్చేలా  చేయండి!!

కార్తీక్ ఇచ్చిన పది రూపాయలను పిల్లలు తీసుకుంటారా? లేదా కార్తీక్ ను అవమానిస్తారా?

ఇక సీన్ కట్ చేస్తే హిమ, సౌర్య ఇద్దరు కూడా ఊరిలోని గవర్నమెంట్ స్కూల్‌కి బయలుదేరారు. యూనీఫామ్ వేసుకుని, బాగ్స్ తగిలించుకుని దీపకు బై చెబుతుంటే ‘ఎలా పెరగాల్సిన పిల్లలు ఎలా అయిపోయారు’ అనే బాధ కార్తీక్ మనసులో మెదులుతుంది. వెంటనే తన జేబులోంచి ఒక పది రూపాయల నోటును తీసి హిమకి ఇస్తూ ‘ఏదైనా కొనుక్కోండమ్మా.. ఇవే ఉన్నాయి అని మొహం బాధగా పెట్టి అంటాడు.ఆ డబ్బులను చూసి హిమ వద్దులే నాన్న నీ దగ్గర ఏమి లేవుగా అంటుంది.హిమ అన్నా మాటలకూ హిమా నువ్వు కూడా నా మీద జాలి చూపించకు’ అంటాడు బాధగా.. అది చూసిన దీప.. ‘హిమా తీసుకో’ అంటుంది. హిమ ఆ పది రూపాయలు అందుకునీ బై చెప్పి స్కూల్‌కి బయలుదేరతారు.

Balakrishna: మంచి స్పీడ్ మీద ఉన్న బాలయ్య…హోస్ట్ గా మరో టాప్ షోకి.??
డైనింగ్ టేబుల్ దగ్గర మోనితకు చివాట్లు పెట్టిన సౌందర్య ఏమి చేస్తుంది?

డైనింగ్ టేబుల్ దగ్గర సౌందర్య, ఆదిత్య, ఆనందరావు కుర్చీకి తింటుంటే శ్రావ్య వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో మోనిత వచ్చి ‘అబ్బా వంటలు గుబాలిస్తున్నాయి నాకు వడ్డించు శ్రావ్యా’ అంటూ ఆదిత్య పక్కనే ఉన్న కూర్చీలో కూర్చుంటుంది. దానితో ఆదిత్య ఛీఛీ అంటూ పైకి లేస్తాడు.అది చుసిన సౌందర్య ‘రేయ్ ఇది మన ఇల్లు నువ్వు ఎందుకు లేస్తున్నావ్ కూర్చో అని, కన్నప్రేమని చూపించడానికి పసివాడ్ని దాచి రాక్షసానందం పొందే మహా తల్లే లేచిపోతుంది. ఊరు పేరు లేనివాళ్లు లేచిపోతారు గాని నువ్వు కూర్చో అంటుంది.అయినా నాకు ఉన్నది ఇద్దరు మనవరాళ్లు.. ఒక్కడే మనవడు, అసహజ పద్దతిలో పుట్టుకొచ్చిన వాళ్లు నాకు ఏమీ కారు’ అంటూ మోనితకి చివాట్లు పెడుతుంది. దాంతో మోనిత ఏదో మాట్లాడానికి చూస్తే ‘విల్ యూ సెట్‌అప్ మోనితా.. గెట్ ఔట్’ అని తిట్టేస్తుంది. దాంతో కుర్చీ వెనక్కి తన్ని మోనిత అక్కడ నుండి వెళ్లిపోతుంది.

కిరాణా షాపుకు వెళ్లిన దీప అవమానపాలవుతుందా..?

మరో పక్క దీప ఓ కిరాణా షాప్‌లో సరుకులు కొనడానికి వెళ్తుంది. అక్కడ దీపను చుసిన ఇద్దరు ఆడవాళ్లు ‘ఇదిగో ఈమె కొత్తగా వచ్చిందట.. ఆ రుద్రాణిని ఎదిరించిందట’ అని చెవులు గొనుక్కుంటూ ఉంటారు.షాప్ యజమానికి సరుకుల లిస్ట్ ఇచ్చి ‘ఈ సరుకులు ఇవ్వండి’ అంటుంది. అమ్మా ఇవేం మా షాప్‌లో లేవుమ్మా’ అంటాడు షాప్ ఓనర్.ఎదురుగా కనిపిస్తుంటే లేవంటారేంటండీ అని దీప అడగ్గా ‘అమ్మా నా కంటికి రుద్రాణి అమ్మే కనిపిస్తోంది.. మీరు వెళ్లొచ్చు’ అంటాడు. ఆ మాటలు విన్న దీప అయ్యో శ్రీవల్లి వాళ్లకి సరుకులు కావాలంటే వచ్చాను.. శ్రీవల్లి వాళ్లు మీకు ఇవ్వాల్సిన బకాయిలో కొంత ఇచ్చి పంపించారు.. వద్దు అంటే వేరే షాప్‌ దగ్గర తీసుకుంటాను లెండి’ అనగా సరుకులు ఇచ్చి మిగతా డబ్బులు కూడా త్వరలోనే తీర్చమని చెప్పండి అంటాడు. అది విన్న ఆ ఇద్దరూ ఆడవాళ్లు.. ‘వీళ్లకే తినటానికి, ఉండడానికి గతి లేక ఆ శ్రీవల్లి ఇంట్లో ఉంటున్నారు వీళ్లు వాళ్ల బకాయలు తీరుస్తారట.. ఏంటో ఈ విడ్డూరం’ అంటూ వెళ్లిపోతారు
మరోవైపు స్కూల్ కి వెళ్లిన హిమ, సౌర్య మధ్యాహ్నం స్కూల్లో పెట్టే భోజనాలు దగ్గరకు వెళ్లి అక్కడ ఆ గిన్నెలు, కింద కూర్చోవడం చూసి ముందు అసహ్యించుకున్నా తరువాత పాపం అమ్మా, నాన్నలని బాధపెట్టకూడదని సరిపెట్టుకుని కూర్చుంటారు.

సీన్ లోకి రత్నసీత…మోనిత పని అయిపోయినట్లేనా?

మరో పక్క సౌందర్య రత్నసీతను కలిసి ‘రత్నసీతా.. నువ్వు మోనితకి ఏ పరిస్థితిల్లో సాయం చేశావో, ఎందుకు చేశావో అవన్నీ అనవసర. కానీ నీవల్ల మేము చాలా నష్టపోయాం.అవన్నీ మర్చిపొయి నీ సాయం కోరి వచ్చాను. ఆ మోనిత బాబు కనిపించడం లేదు అని మాతో ఆడుకుంటోంది. ఒకవేళ ఆ బాబుని నీ దగ్గర దాచి ఉంటుందేమో అనే అనుమానంతో నీ దగ్గరకు వచ్చాను.. నిజం చెప్పు ప్లీజ్ అని అడుగుతుంది. దాంతో రత్నసీత ‘అయ్యో మేడమ్.. నిజంగా నాకు ఏమి తెలియదు.. ఆ మోనితకు సాయం చేసినందుకు ఇప్పటికీ నేను ఫీల్ అవుతున్నాను.ఇప్పుడు నేను మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అంటుంది. చెప్పండి మేడమ్ నేనేం చెయ్యాలి’ అంటుంది. దాంతో సౌందర్య.. ‘ఆ మోనిత కథలికలపై ఓ కన్ను వేసి ఉంచు చాలు. తను ఎవరిని కలుస్తోంది?ఎక్కడికి వెళుతుంది? ఏం ప్లాన్ చేస్తుంది అంతా తెలుసుకో రత్నసీత’ అంటుంది. రత్నసీత దానికి సరేనంటుంది.

బియ్యం ముట తలపై, సరుకులు చేత్తో పట్టుకుని పాపం దీప… !

షాప్ అతని దగ్గర సరుకులు తీసుకున్న దీప కొన్ని సరుకులు ఒక చేత్తో, బియ్యం మూట తలపైన పెట్టుకుని నడిచి వస్తుండడం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి దీపా అంటూ మూట దించి ఏంటీ పనులు అంటూ బాధపడతాడు తన చేతకాని తనాన్ని తిట్టుకుంటాడు కార్తీక్. దాంతో దీప కార్తీక్‌కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.మరి దీప కష్టాన్ని చూసిన కార్తీక్ఏమి చేస్తాడో అనేది తరువాయి భాగంలో చూద్దాం. !

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!