Musquitos : దోమలకు నచ్చదు
ఏ సీజన్ అయినా సరే.. దోమలకు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. దాని కోసం వాటికి నచ్చని వాసనలు వచ్చేలా చేయడం ఒక్కటే మార్గం… దోమలకు ( Musquitos ) నచ్చని వాసనలు కొన్ని ఉంటాయి. వాటిలో వెల్లుల్లి వాసన అంటే దోమలకు అస్సలు నచ్చదు. దాని కోసం వెల్లుల్లి నుంచి రసాన్ని తీసి నీటిలో కలిపి దాన్ని ఇల్లంతా స్ప్రే చేసుకోవాలి. అప్పుడు దోమలు అస్సలు రానే రావు. వెల్లుల్లి రసాన్ని శరీరానికిరాసుకున్న కూడా దోమలు మిమ్మల్ని కుట్టవు.
Musquitos : దగ్గరికి రావు
దోమలకు తులసి ఆకుల వాసన కూడా అస్సలు నచ్చదు. నాలుగు తులసి ఆకులను లేదా పూదీన ఆకులను దగ్గర పెట్టుకుంటే ఆ వాసన వాటికి నచ్చదు కాబట్టి అస్సలు అవి మన దగ్గరికి రావు.తులసి ,పొదీనా ఆకులు అందుబాటులో ఉండవు అనుకుంటే తులసి ఆకుల నూనె, పూదీన ఆకుల నూనె మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని తెచ్చుకొని శరీరానికి రాసుకుంటే, దోమలు పారిపోతాయి. వేపాకులంటే కూడా దోమలకు అస్సలు నచ్చదు. కాబట్టి వేపాకులను ఇంట్లో పెట్టుకున్న ,వేపాకులతో పొగ వేసినా దోమలు ఇంట్లో నుంచి పారిపోతాయి. నీమ్ ఆయిల్ శరీరానికి రాసుకుంటే.. దోమలు కుట్టవు.
ఆ వాసనకు ఎక్కువ
పెర్ ఫ్యూమ్స్, స్ప్రేలు ఎక్కువగా ఉపయోగించే వాళ్లను దోమలు ఎక్కువగాకొడుతుంటాయి. దీనికి కారణం దోమలకు పర్ ఫ్యూమ్ వాసన అంటే చాలా ఇష్టం ఉండడమే. కాబట్టి దోమలు ఆ వాసనకు ఎక్కువ ఆకర్షించబడతాయి. అలాగే ‘ఏ’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికంటే కంటే ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారిని దోమలు రెండు రెట్లు ఎక్కువగా కుడతాయని నిపుణులు తెలియచేస్తున్నారు. పిల్లల కన్నా పెద్దవాళ్ళని దోమలు ఎక్కువగా కొడుతుంటాయి. జిమ్ చేసే సమయం లో కూడా దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంటుంది దీనికి కారణం చెమట ఎక్కువగా పట్టి చెమట వాసనకు ఆకర్షితమైన దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.