NewsOrbit
న్యూస్

Hemachandra-Sravana Bhargavi: విడాకుల వార్త‌ల‌పై హేమచంద్ర-శ్రావణ భార్గవి ఏమ‌న్నారో తెలుసా?

Hemachandra-Sravana Bhargavi: ప్ర‌ముఖ సింగ‌ర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవిల పేర్లు గ‌త కొద్ది రోజుల అటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ మారుమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. అందుకు కార‌ణం..వీరి విడాకుల రూమ‌ర్సే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. విడాకులు తీసుకోబోతున్నార‌ని, ఇప్ప‌టికే వీరిద్ద‌రూ విడి విడిగా ఉంటున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఓ లేడీ సింగర్ వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టిందని, అందుకే వీరిద్ద‌రూ విడిపోయేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా హేమచంద్ర, శ్రావణ భార్గవిలు నోరు విప్పారు. హేమచంద్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో `నా సాంగ్‌కంటే చాలా తొందరగా అనవసరమైన సమాచారమే వ్యాపిస్తుంది` అంటూ పోస్ట్ పెట్టారు.

మ‌రోవైపు శ్రావణ భార్గవి విడాకులు వార్త‌ల‌పై స్పందిస్తూ.. `కొన్ని రోజులుగా నా యూట్యూబ్‌ ఛానల్‌లోని వీడియోలకు వ్యూస్‌ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు కూడా పెరిగారు. నాకు పని పెరిగింది, దానితో పాటు ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇదంతా జరిగింది` అంటూ కౌంట‌ర్లు వేసింది.

మొత్తానికి విడాకుల వార్త‌లు కేవ‌లం రూమ‌ర్స్ మాత్ర‌మే అంటూ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ తేల్చేశారు. కాగా, శ్రావణ భార్గవి, హేమచంద్రల మ‌ధ్య‌ సూపర్ సింగర్ కార్యక్రమం ద్వారా పరిచయం ఏర్ప‌డ‌గా.. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌, పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఈ జంట పెద్దలను ఒప్పించి 2013లో ఘనంగా వివాహం చేసుకున్నారు. గ‌త‌ తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గ‌డుపుతున్న ఈ దంప‌తులు 2016లో శిఖర చంద్రిక అనే కుమార్తెకి జ‌న్మ‌నించారు. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా హేమచంద్ర-శ్రావణ భార్గవిలిద్ద‌రూ స‌క్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు.

author avatar
kavya N

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N