33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Pakka Commercial: `పక్కా కమర్షియల్` నుండి మ‌రో ట్రైల‌ర్‌.. ఆడియన్స్‌కు మ‌జా ఖాయ‌మే!

Share

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు. స‌త్య‌రాజ్‌, రావు ర‌మేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, స‌ప్త‌గిరి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం జూలై 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచ‌గా.. మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు తాజాగా మేక‌ర్స్ మ‌రో ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

`పాతికేళ్ల తర్వాత బ్లాక్ కోటు వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి..` అంటూ రాశీ ఖన్నా చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైల‌ర్ ఆథ్యంతం ఆక‌ట్టుకుంది. యాక్ష‌న్‌, కామెడీతో పాటుగా అన్ని కమర్షియల్ హంగులు జోడించి ఈ చిత్రానికి రూపొందించార‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. గోపీచంద్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌, స్టైల్‌తో అద‌ర‌గొట్టేశారు.

మ‌రోవైపు రాశి ఖ‌న్నా ఒక సీరియల్ ఆర్టిస్టుగా మరియు లాయర్ గా అలరించింది. తండ్రీకొడుకు(గోపీచంద్-స‌త్య‌రాజ్‌)లకు విడాకులు విప్పించండి అని రాశి కోర్టులో వాదించడం న‌వ్వులు పూయించింది. జయం, నిజం, వర్షం అంటూ తాను విలన్ గా నటించిన సినిమాల పేర్లు గోపీచంద్ ప‌ల‌క‌డం విశేషం. `నోట్లో పాన్‌ వేసుకుని, షర్ట్ మడత పెట్టి దిగితే కటౌట్లు విరగాల్సిందే, ఫ్లెక్సీ చిరగాల్సిందే, మజా వస్తుందని ప‌దా` అంటూ గోపీచంద్ చెప్పిన డాల‌గ్ విజిల్స్ వేయించే విధంగా ఉంది. మొత్తానికి అద్భుతంగా ఉన్న ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే.. థియేట‌ర్స్‌లో జూలై 1న ఆడియ‌న్స్‌ను మ‌జా ఖాయ‌మ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.


Share

Related posts

పవన్ కళ్యాణ్ కంటే ముందే వస్తానంటున్న నితిన్ ..?

GRK

Krishna Mukunda Murari: మురారి ఆదర్శ్ నడి మధ్యలో ఉన్న ముకుందా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళ నాన్న..!

bharani jella

Kriti Sanon: తమిళ్ లో ఆ బడా స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న కృతిసనన్..!!

sekhar