Heroines: బాలీవుడ్లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, అలియా వంటి హీరోయిన్లు మోడ్రన్ లుక్స్‌లో కనిపిస్తూ అందరి మనసులు దోచేస్తుంటారు. అలాగే మోడ్రన్ గా ఆలోచిస్తూ మోడ్రన్ లైఫ్ స్టైల్ సాగిస్తుంటారు. అయితే ఇలాంటి స్టార్ హీరోయిన్లు తమ పిల్లలకు మాత్రం మోడ్రన్ నేమ్స్ కాకుండా దేవుళ్ల పేర్లు పెడుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. అలాగే దేవుళ్ళ పట్ల ఉన్న తమ భక్తిని చాటుకుంటున్నారు.
Heroines: అలియా భట్
అలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఇటీవలే తమకు పుట్టిన పాపకు ‘రాహ’ అని నామకరణం చేశారు. రాహ అనే పేరుకి చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అతేంద్రియ మార్గం. అంటే దేవుని మార్గం అని అర్థం.
అనుష్క శర్మ
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కూతురికి ‘వామిక’ అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గామాత అవతారం అని అర్థం.
బిపాసా బసు
బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవత్లకు నవంబర్ 12న పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ జంట తమ కూతురికి దేవి అని నామకరణం చేశారు.
సోనమ్ కపూర్
సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా తమ కుమారునికి వాము అని పేరు పెట్టారు. ఈ జంట హనుమంతునిపై భక్తితో తమ బిడ్డకు ఆ పేరు పెట్టుకున్నారు.
ప్రియాంక చోప్రా
ఈ ఏడాది ప్రారంభంలో సరోగసి ద్వారా కుమార్తెను పొంది తల్లితండ్రులుగా మారారు ప్రియాంక, నిక్ జోనాహ్. ఈ జంట తమ బిడ్డకు మాల్తీ మేరీ చోప్రా జోనస్ అని పేరు పెట్టారు. మల్తీ అంతే భగవంతునికి అర్పించే పూల సువాసన అని అర్ధం.
ఐశ్వర్యరాయ్
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ కుమార్తెకు ఆరాధ్య అని పేరు పెట్టుకున్నారు. ఆరాధ్య అంటే భగవంతుని ఆరాధన అని అర్థం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!