హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు గత ఏడాది డిసెంబర్ నెలలో జాహేద్ ముఠా ను అరెస్టు చేశారు. పాకిస్థాన్, నేపాల్ మీదుగా జాహేద్ గ్యాంగ్ హైదరాబాద్ కు పేలుడు పదార్ధాలు తరలించింది. దసరా పర్వదినం సందర్భంగా నిర్వహించే వేడుకల్లో పేలుళ్లు జరపాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను గుర్తించింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని నిందితులు ప్లాన్ చేశారు.

దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కల్గించేలా ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. నిందితులు జాహేద్ తో పాటు షారూఖ్, సమియొద్దీన్ లు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ ముఠా పాక్ నుండి మనోహరాబాద్ కు హ్యాండ్ గ్రనేడ్లు తరలించారు. జాహేద్ అనుచరులు మనోహరాబాద్ నుండి హైదరాబాద్ కు గ్రనేడ్లు తెచ్చారు. 15 సంవత్సరాల క్రితం టాస్క్ ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్ నిందితుడుగా ఉన్నారు.
ఏపి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల