మెగాస్టార్ చిరంజీవి తన స్వయంకృషితో సినిమాల్లో రాణిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావమే ఆయనకు అశేషమైన అభిమానాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాదు చాలామంది యంగ్ హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక సీనియర్ హీరోయిన్స్, దర్శకులు కూడా చిరుని చూసే సినిమాల్లో రంగప్రవేశం చేశారు. వారిలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఒకరు. కృష్ణవంశీకి చిరంజీవి అంటే ఎంతో ప్రేమ, అభిమానం. చిరుని తన సొంత అన్నయ్యగా భావిస్తూ అభిమానిస్తుంటాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నయ్య చిరు మంచి హస్తం వల్లే తానింకా ప్రాణాలతో ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కారు బహుమతిగా ఇచ్చాడు
డైరెక్టర్ కృష్ణ వంశీ మాట్లాడుతూ.. “నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. చిన్నాపెద్దా భేదం లేకుండా అందరినీ ఆయన ఎంతగానో గౌరవిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలోనే కాకుండా ఇప్పుడు మెగాస్టార్గా ఎదిగి తర్వాత కూడా ఆయన స్వభావంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. నేను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ‘గోవిందుడు అందరివాడే’ సినిమా డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాడు. గతంలో నేను అన్నయ్యతో కలిసి ఒక యాడ్ చేశాను. దానికి డబ్బింగ్ చెప్పే సమయంలో ‘అన్నయ్య మీకు నచ్చిన వాళ్లకి ఈ కారు గిఫ్ట్ గా ఇస్తారా’ అని సరదాగా అడిగాను. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి నన్ను ఇంటికి పిలిచి ‘ఈ కారు నీకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను’ అని నాతో అన్నారు…..”
చిరు వల్లే బతికున్నా
రాజమౌళి మరియు చిరంజీవి సమర్పణలో వస్తున్న బాలీవుడ్ సినిమాలు..!!
“నాకు బహుమతులు తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే అన్నయ్య ఇచ్చే బహుమతిని వద్దని చెప్తుంటే, ‘అన్నయ్య అని పిలుస్తున్నావ్, మరి నేను గిఫ్ట్ ఇస్తే తీసుకోవా? ‘అని ఒక్క మాట అన్నారు. దాంతో అన్నయ్య మాట కాదనలేక నేను ఆ గిఫ్ట్ ని తీసుకున్నా. ఒకసారి పనిమీద అదే కారులో నందిగామ వెళ్లి రిటన్ అవుతుండగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. డ్రైవర్, నేను స్వల్ప గాయాలతో బయటపడ్డాం. అన్నయ్య ఇచ్చిన ఈ కారు వలే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను” అని కృష్ణ వంశీ చెప్పుకొచ్చాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!