న్యూస్ హెల్త్

మీరు ఫిబ్రవరి నెలలో పుట్టారా ?అయితే  ఇది  మీకోసమే!!

Share

ఫిబ్రవరి  లో  పుట్టిన స్త్రీ, పురుషులందరికి ఇది వర్తిస్తుంది.ఈ నెలలో పుట్టినవారు కొంతవరకు బలహీనులు గా ఉంటారు…అన్ని విషయాలలో వీరు కాస్త వేనుకబడి ఉంటారు.అదృష్టం అంతంత మాత్రం గా ఉంటుంది.అయినా ఈ నెలలో పుట్టినవారిలో మంచి విద్యావంతులు ఉన్నారు. విద్యని అభ్యసించి మంచి కీర్తి గడించినవారు ఉన్నారు.సమాజం లో మంచి గుర్తింపు మంచి స్థాయి లభిస్తుంది.వీరిలో ఎలాంటి  లోపం కనిపించదు.

 

వీరిలో చిన్న చిన్నబలహీనతలు మాత్రం ఉంటాయి.ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు,కళాకారులు,చిత్ర కారులు,వేదాంతులు,డాక్టర్ లు కూడా ఉన్నారు.కొంచెం పిరికితనం భయపడే  మనస్తత్వం ఉంటుంది.  ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది.కోపం తో పాటు ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది.ఒక విధం గా చెప్పాలంటే సున్నితమైన మనస్సు కలవారు.ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది.ఇతరుల వలన స్థిరాస్తి కలిసి వస్తుంది.

ఈ నెలలో పుట్టినవారు ఇతరులను బాగా ఆకర్షిస్తారు.ఎవ్వరితో అయినా ఎక్కువకాలం స్నేహం చేయగల మనస్సు వీరికి ఉంటుంది.ఎదుటివారికి మేలుచేసే మనస్తత్వం కలిగిఉంటారు.ఈ నెలలో పుట్టిన వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది.వ్యాపార విషయం లో మీరు ఎవరికైనా సలహా ఇచ్చిన వారి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.జీవితం లో ఎదగాలనుకుంటే, మంచి  స్థాయికి  రావాలనుంటే.. సున్నితమైన మనస్సు వదిలి ఆత్మావిశ్వాసం పెంచుకోక పొతే చాలా నష్టపోతారు అని గుర్తు పెట్టుకోండి.సమాజం లో పేరు తెచుకోగల అదృష్టము, సమాజ సేవ చేసే అవకాశము మీకు ఉంది.

మీకు నరముల బలహీనత,ఉదర వ్యాధులు రావచ్చు.లివర్ వ్యాధులు వస్తాయి.మీకు ఎక్కువగా ధర్మసంస్థలు, భీమా సంస్థల ద్వారా ఆర్ధిక లాభం కలుగవచ్చును. బుధవారం, శనివారం లో అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా  పని  చేయాలనుకున్నప్పుడు  ఆ  రోజులు  వచ్చేలా  చూసుకోండి.. వంకాయ రంగు, గ్రే కలర్ దుస్తులు మీకుబాగా  కలిసివస్తాయి. మీకు ఉన్న బలహీనత చూసి భయపడకుండా… బలాలతో జీవితం లో విజయాలు పొందండి.


Share

Related posts

Vizag Steel Plant బ్రేకింగ్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కే ఏ పాల్ సెన్సేషనల్ డెసిషన్..!!

sekhar

బాబు మీద ఈ కారణంతో సీబీఐ వేస్తే – జగన్ మీద ఆ కారణంతో వెయ్యాలిగా మరి!

CMR

Sravana Masam: శ్రావణ మాసంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుంది..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar