గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురం లో” సినిమాతో భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వైరస్ దెబ్బకి పెద్ద హీరోల సినిమాలు ఏదీ కూడా రిలీజ్ కాకపోవడంతో.. బన్నీ ఏ టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా గత ఏడాది నిలిచాడు.
కాగా ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే సినిమా బన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో ఆర్య, ఆర్య 2 రావడంతో ఈ సినిమాపై బన్నీ అభిమానులకు అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. పైగా రంగస్థలం వంటి మాస్ హిట్ తీసి అదే రీతిలో “పుష్ప” సినిమాలో ఊర మాస్ లెవెల్ లో.. అల్లు అర్జున్ ని సుకుమార్ చూపించబోతున్నారు.
గుబురు జుట్టు తో పాటు గుబురు గడ్డంతో.. అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటిస్తున్నట్లు లేటెస్ట్ గా ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే విలన్ పాత్రలో బాబీ డియోల్ ని చూపించడానికి సుకుమార్ డిసైడ్ అయినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!