మీరు నైట్ అవుల్ అయితే ఈ సమస్యలు తప్పవు

రాత్రి పూట సమయానికి నిద్రించేవారిలో అనారోగ్య సమస్యలు వుండవని మరియు వారిని  ఒబిసిటీ వేధించదని వైద్యులు చెప్తున్నారు. కొంతమందికి వర్క్ టెన్షన్స్ వల్ల రాత్రుళ్లు నిద్రపట్టదు. దీంతో ఉదయం కాసేపు ఎక్కువగా నిద్రిస్తుంటారు. పగటిపూట నిద్రతో మధుమేహం మరియు ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవని ఇటీవల పరిశోధనలో తేలింది.

మీరు నైట్ అవుల్ అయితే ఈ సమస్యలు తప్పవు

పగటి పూట నిద్రించే వారికి డయాబెటిస్, బరువు పెరగడం, తలనొప్పి, గుండె జబ్బులు, క్యాన్సర్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అంటున్నారు డాక్టర్లు. కాబట్టి రాత్రిపూట తగినంత నిద్రపోయిన వారు పగటి పూట నిద్రను మానుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు.

నైట్ షిఫ్టులు చేస్తున్నవారు కంప్యూటర్లుకు మరియు సెల్ ఫోన్లకు  తమ నిద్రను అంకితం చేస్తే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కాబట్టి రోజూ రాత్రి పూట కచ్చితంగా 8 గంటల పాటు నిద్రించడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. మరి ఇంకొందరు అయితే నైట్ షిఫ్ట్స్ చేయడం వల్ల పగలు పడుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారి అందరూ అలానే నైట్ మేలుకుని ఉంటున్నారు. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయ్యింది. ఎక్కువ సేపు మేల్కొని ఫోన్ కాల్స్, చాటింగ్స్ అలవాటు అయిపోయాయి. కాబట్టి లేట్‌గా నిద్రిస్తున్నారు..

రాత్రిపూట మంచి నిద్రపట్టడానికి పడుకునే ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. స్పైసీ ఫుడ్‌,  జంక్ ఫ్ఫుడ్స్ తినకూడదు. రాత్రి పూట మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి మాంసాహారం లాంటివి రాత్రిపూట తీసుకోవడం మంచిదికాదు. అలాగే కెఫిన్‌ ఉన్న పదార్ధాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర సరిగా పట్టదు.