రేషన్ డీలర్లకు వరం

రేషన్‌ డీలర్ల కారుణ్య నియామకాల వయోపరిమితిని మరో 10 ఏళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్‌ డీలర్ల సంఘం వినతిపై ఏపీ స్టేట్‌ టార్గెట్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లో ప్రభుత్వం సవరణ చేసింది. కారుణ్య నియమకాలకు గరిష్ఠ వయోపరిమితి గతంలో 40 ఏళ్లకు పరిమితమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ సవరణతో కారుణ్య నియామక వయస్సును 18 నుంచి 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి