NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ACB : ఇంద్రకీలాద్రి లో 13 మంది ఇంటి దొంగల సస్పెన్షన్!అక్రమార్కుల జాబితా చాంతాడంత ఉందంటున్న ఏసీబీ!

ACB : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈవో సురేష్‌బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఏసీబీ సోదాల్లో అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ గుర్తించిన 13 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. దీంతోపాటు మరింత మందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాలలో అక్రమాలు గుర్తించిన ఏసీబీ.. ఈవోకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ఇచ్చారు.

Indrakeeladri 13 house burglars suspended! ACB seems to have a long list of illegals!
Indrakeeladri 13 house burglars suspended! ACB seems to have a long list of illegals!

అన్నదానం, చీరల గోడౌన్, ప్రొవిజన్‌ స్టోర్‌, ఆర్జిత సేవా కౌంటర్లల్లో సిబ్బందిపై వేటు వేశారు.ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్‌ చేసింది. అమ్మవారి సొమ్మును అడ్డంగా దోచుకున్న అధికారుల లిస్ట్‌ రెడీ చేసింది. మూడ్రోజుల సోదాల్లో నాలుగేళ్ల ఫైల్స్‌ను తవ్వి తీసిన ఏసీబీ టీమ్స్‌… గత పాలకమండలి హయాంలో వచ్చిన ఆరోపణలపైనా రిపోర్ట్‌ రెడీ చేసింది.

ACB : అక్రమాల పుట్టగా మారిన ఆలయం !

దుర్గ గుడిలో అక్రమాల్ని ఏసీబీ అధికారులు తవ్వితీశారు. మూడ్రోజులపాటు అన్ని విభాగాల్లో సోదాలు నిర్వహించి… అధికారుల అవినీతిపై కీలక సమాచారం రాబట్టారు.ప్రస్తుత పాలకమండలి హయాంలో జరుగుతున్న పనులపైనే కాకుండా.. గత నాలుగేళ్ల ఫైళ్లను పరిశీలించారు. గత పాలకమండలి హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో… అప్పట్లో జరిగిన అన్ని పనులకు సంబంధించిన ఫైళ్లను తవ్వి తీశారు. కొండపై అభివృద్ధి పనులు, ఇంజినీరింగ్‌, టెండర్ల పనుల డేటా సేకరించారు.పక్కా సమాచారంతోనే రంగంలోకి ఏసీబీ అధికారులు దిగారని తెలుస్తోంది.

ఈవో చర్యలూ అనుమానాస్పదం!

రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్‌ను కేవలం 40 లక్షలకే విక్రయించినట్లు గుర్తించారు. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చాయి తేల్చారు. లడ్డూ ప్రసాదాలు, టిక్కెట్, చీరల కౌంటర్లతో పాటు టోల్ గేట్, కేశ ఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగాల్లో… ఏ ఫైల్‌ తీసినా అవినీతిమయమైనట్లు ఏసీబీ టీమ్స్‌ నిర్ధారించాయి.దేవస్థానంలో ఏ పనిచేసినా.. వాటికి సంబంధించిన ఫైళ్లను ఈవో పరిశీలించాకే అప్రూవ్‌ చేయాలి. కానీ.. ఇంద్రకీలాద్రిపై ఇలాంటి రూల్స్‌ పాటించట్లేదని ఏసీబీ తేల్చింది. ఇక మూడ్రోజులుగా అవినీతి ఫైళ్లను తవ్వి తీసిన అధికారులు… ప్రతి మారినో విభాగంలోనూ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. వీటిపై త్వరలోనే ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ పంపించేందుకు రెడీ అవుతున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N