Bigg boss RaviKrishna : బిగ్ బాస్ రవికృష్ణ తెలుసు కదా. బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో అలరించాడు కదా. ఆయనే.. బిగ్ బాస్ కంటే ముందు చాలా సీరియళ్లలో రవికృష్ణ నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు కానీ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక రవికృష్ణకు బాగానే ఫాలోయింగ్ వచ్చింది. సెలబ్రిటీ అయిపోయాడు.

రవికృష్ణ చాలా సున్నిత మనస్కుడు. చాలా ఓపిక. ఆ విషయం.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తెలిసింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు.. రవికృష్ణ చాలామందికి ఫేవరేట్ కంటెస్టెంట్. ఫైనల్స్ కు కూడా వెళ్తాడని భావించారు కానీ.. ఫైనల్స్ కు చేరలేదు రవికృష్ణ.
అయితే.. బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే రవికృష్ణకు స్టార్ మా చానెల్ లోనే ఓ టీవీ సీరియల్ లో అవకాశం వచ్చింది. ఆమె కథ అనే సీరియల్ లో లీడ్ రోల్ లో రవికృష్ణకు అవకాశం వచ్చింది. అదే సీరియల్ లో హీరోయిన్ గా నటించిన నవ్య స్వామి ప్రేమలో పడ్డాడు రవికృష్ణ. వీళ్ల విషయం ఇటీవలే తెలిసింది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు కూడా ఖుషీ అవుతున్నారు.
Bigg boss Ravikrishna : ఆమె కథ సీరియల్ షూటింగ్ సెట్ లో మొదటి సారి నవ్యను చూసి రవికృష్ణ పడిపోయాడట
అయితే.. నవ్య స్వామిని.. రవికృష్ణ మొదటిసారి షూటింగ్ సెట్ లో చూశాడట. చూసిన వెంటనే పడిపోయాడట. గుండెల్లో గంటలు మోగాయట. చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. అయితే.. నవ్య స్వామి కూడా ఆమె కథ ప్రోమో షూట్ లో మొదటిసారి సెట్ లో రవికృష్ణను చూసి పడిపోయిందట. అంటే ఇద్దరిదీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట.
మొత్తానికి వీళ్ల ప్రేమ.. వీళ్ల ప్రేమ కథ ఎలా మొదలైంది.. అన్ని విషయాలను తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పంచుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.