కరోనా కారకం ఏమిటో… ఇంకా శోధనలే..!!

 

 

కరోనా ప్రపంచ దేశాలు అన్నిటిని గజగజలాడిస్తున్న మహమ్మారి.దీన్ని వ్యాప్తి మొదలయ్యి ఏడాది పూర్తయినప్పటికీ, తీవ్రత తగ్గనేలేదు. ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారిని ఎదురుక్కోవడానికి ప్రపంచ దేశాలు అన్ని అధ్యనాలు చేస్తున్నాయి. అయితే మహమ్మారి మొదటిగా చైనా లోని వుహాన్ నగరం లో పురుడు పోసుకున్నది అనే విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ ఎలా పుట్టింది అనే విషయం మీద భిన్నాభిప్రాయాలూ ఉన్నప్పటికీ , హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన దాని ప్రకారం 2019 నవంబర్‌ 17న మొదటి కేసు వుహాన్ లో నమోదు అయింది. దీనితో, పరిశోధనలు మొదలుపెట్టిన వైద్యులు, శాస్త్రవేత్తలు వైరస్ ఎక్కడ ఉద్భవించిందో, కోవిద్-19 వ్యాప్తి ఎలా మొదలైంది అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైద్యులు తొలి కేసులను కనుగొనగలిగితే, వారు వైరస్ దాగి ఉన్న జంతు హోస్ట్‌ను గుర్తించగలుగుతారు.

latest news in news orbit

అయితే అసలు కరోనా మహమ్మారి ఎలా పుట్టింది అనే దాని పైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో, ముందుగా వైరస్ ఉన్న గబ్బిలాని తినడం ద్వారా మనుషులకి వ్యాపించింది అని కనుగొన్నారు. కానీ, ఇదే కారణం వల్ల కరోనా వైరస్ సంక్రమించలేదు అని కొన్ని అధ్యనాలు తెలిపాయి. మరోవైపు అగ్ర రాజ్యం అయినా అమెరికా, కోవిద్-19 వైరస్ ను చైనా పరిశోధన లాబ్స్ లో ఉదేశపుర్వకంగానే కనుగొన్నారు అని, ఆ దేశం పైన ఆరోపణలు చేసింది. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పుట్టుక పైన చైనా లో అధ్యయనం చేయడానికి అధికారులను ఆదేశించింది. మరో వైపు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి మొదటి కేసు వుహాన్ నగరం లో నమోదైనప్పటికీ, వైరస్ జననం ఇక్కడ కాదు అని అన్నారు. ఈ మహమ్మారి పుట్టుక చాలా సంఖ్లిష్టమైన ప్రక్రియ అని, చైనా లో కనిపించినంత మాత్రాన ఇది ఇక్కడ జన్మించినట్లు కాదు అని చైనా వాదిస్తుంది. దీనికి కారణముగా, భారత్ దేశం నుండి దిగుమతి చేసిన చేపలలో అలాగే వివిధ దేశాల నుండి దిగుమతి చేసిన ఆహార పదార్ధాలలో కోవిద్ వైరస్ లక్షణాలు కనిపించాయి అని చైనా అధికారులు తెలుపుతున్నారు. ఈ వైరస్ పుట్టుక గల కారణాలు తెలుసుకోవాలి అంటే దేశాలు అని కలిసి పని చేయాలి అన్ని అప్పుడే దీనికి తగిన కారణాలు తెలుసుకోగలం అని చైనా ప్రకటించింది. అయితే డబ్ల్యూ హచ్ ఓ ప్రతినిధులు వైరస్ కు గల కారణాలు పరిశోధించడానికి వెళ్లనున్న సమయం లో చైనా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.