ట్రంప్ మామూలోడు కాదు.. ఫిటింగులు.., ఫైటింగులు..!!

 

ఇల్లు అలక గానే పండగ కాదు అన్నాడు ఒక కవి. ఈ మాటలనే చెప్తున్నాడు అగ్ర రాజ్య ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఎన్నికల ఫలితాలను అంగీకరించను అని, యూఎస్‌ ఎలక్టోరల్‌ కాలేజీ కూడా జో బైడెన్‌ను విజేతగా ధ్రువీకరించాల్సి ఉంది అని, అప్పుడే బైడెన్ అధ్యక్షుడు అవుతాడు అని ట్రంప్ వ్యాఖ్యనించారు. అగ్ర రాజ్యం ఎన్నికలు ఎప్పుడు లేని విధంగా ఎంతో ఉత్కంఠ మధ్య సాగాయి. 306 ఎలక్టోరల్‌ కాలేజీ స్థానాలలో డెమోక్రాటిక్ పార్టీ విజయం సాధించింది. అయితే 232 ఎలెక్ట్రోల్ స్థానాలు మాత్రమే గెలిచి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. అయితే రిపబ్లికన్ అధ్యక్షుడు ట్రంప్ ఓటమిని ఒప్పుకోను అని, ఎన్నికల్లో మోసం జరిగిందని అని తన వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె థాంక్స్ గివింగ్ డే లో పాల్గొన్న డోనాల్డ్ ట్రంప్, మీడియా తో మాట్లాడాతూ ‘‘మీరంతా ఇది అధ్యక్షుడిగా నా చివరి థ్యాంక్స్ ‌గివింగ్ ‌డే అనుకోవచ్చు. కానీ ఎవరికి తెలుసు, ఇది రెండో దఫా అధ్యక్షుడిగా నా తొలి థ్యాంక్స్‌ గివింగ్‌డే కావచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

 

US President Donald Trump

అసలు విషయం ఏంటి అంటే, అమెరికా ఎన్నికలలో ఓటర్లు నేరుగా అధ్యక్షున్ని ఎన్నుకోరు. బదులుగా వారు ఎలక్టోరల్స్‌ను ఎన్నుకుంటారు. వీరంతా కలిసి అధ్యక్షుణ్ని ఎన్నుకొని తుది ఫలితాలను వెల్లడిస్తారు. 538 మంది సభ్యులుండే ఎలక్టోరల్‌ కాలేజీలో, 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించడం తో అమెరికా అధ్యక్షుడు కాగలరు. ఈ సమావేశం డిసెంబర్ 14 న జరగనున్నది. ఈ సమవేశం లో ఏమైనా జరగవచ్చు అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. అయితే ఈ తరుణంలోనే యూఎస్‌ ఎలక్టోరల్‌ కాలేజీ కూడా జోబైడెన్‌ను విజేతగా ధ్రువీకరించాల్సి ఉంది, అప్పుడే తను వైట్‌హౌస్‌ నుంచి వైదొలుగుతానని అన్నారు. అయితే ఇప్పటికే అధికార బదిలీ ప్రక్రియకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార బదిలీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (GSA) విభాగం చీఫ్‌ ఎమిలీ మర్ఫీకి అధికార బదిలీ ఏర్పాట్లు చేసేందుకు ట్రంప్‌ అనుమతించారు. అయితే ఎన్నికల ఫలితాలపై మా న్యాయపోరాటం కొనసాగుతుంది. అంతిమంగా మేమే విజయం సాధిస్తామని నాకు నమ్మకం ఉంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.