NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇవి పాటిస్తే త‌క్కువ పెట్టుబ‌డితో రూ.ల‌క్ష‌ల సంపాద‌న మీ సొంతం!

ఈ ఉరుకుల ప‌రుగుల కాలంలో జీవితం కూడా అంతే వేగంగా ప్ర‌యాణించాల‌ని అంద‌రూ కోరుకుంటారు. మ‌రీ ముఖ్యంగా త‌క్కువ సమ‌యంలోనే కెరియ‌ర్‌లో సెటిలవ్వాల‌ని అనుకుంటారు. మ‌రి కొంద‌రైతే త‌క్కువ స‌మ‌యంలో.. త‌క్క‌వు పెట్టుబ‌డితో ఎక్క‌వ మ‌నీ సంపాదించాల‌ని అనుకుంటూ వుంటారు. అయితే, ఇందులో రిస్కు కూడా అధికంగానే ఉంటుంది. అయితే, దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులలో రిస్కు కొంచెం త‌క్కువ‌నే చెప్పుకోవాలి. మీరు కూడా అలా త‌క్కువ మొత్తంతోనే అద్దిరిపోయే లాభాలు పొందలానుకుంటున్నారా? అయితే, మీ కోసం ఇక్క‌డ ప‌లు ఆప్ష‌న్లు ఉన్నాయి..!

వాటిలో మొద‌టిది స్టాక్ మార్కెట్లు. స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయిన వారు కూడా ఉన్నారు. కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఎందుకంటే దీని గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకోకుండా పెట్టుబ‌డులు పెట్ట‌డం మ‌న‌ల్ని పూర్తిగా ముంచ‌డం కూడా జ‌ర‌గ‌వ‌చ్చు. అందుకే స్టాక్స్ కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుని ఇందులో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్త‌మం. నెల‌కు రూ.1000 వ‌ర‌కూ ఇన్వెస్ట్ చేస్తూ.. దాదాపు 5 నుంచి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కొన‌సాగిస్తే.. మంచి లాభాలు పొంద‌వ‌చ్చు.

స్టాక్ మార్కెట్ల త‌రువాత త‌క్కువ పెట్టుబ‌డితో మంచి రాబ‌డి పొంద‌డంలో ఉప‌యుక్తంగా ఉండేవి మ్యూచివ‌ల్ ఫండ్స్. వీటిల్లో నెల‌కు త‌క్కువ పెట్టుబ‌డి (దాదాపు రూ.500 నుంచి) పెట్టొచ్చు. దీర్ఘ‌కాలం పాటు వీటిల్లో ఇన్వెస్టు చేయ‌డం మంచింది. అయితే, స్టాక్ మార్కెట్, మ్యూచివ‌ల్ ఫండ్స్ తో పొల్చుకుంటే.. రిస్కు త‌క్కువ ఉండాలంటే.. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్త‌మం. వీటిలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా ప‌న్ను మిన‌హాయింపుతో పాటు 7.1 శాతానికి పైగా వ‌డ్డీ కూడా పొంద‌వ‌చ్చు. దీనికి సంబంధించిన ఓ స్కీమ్‌లో నెల‌కు రూ.1000 డిపాటిజ్‌చేస్తే.. 15 సంవ‌త్స‌రాల త‌రువాత మీరు రూ. 3,25,457 పొంద‌వ‌చ్చు. ఇత‌ర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఇక బ్యాంకులు, పోస్టాఫీసులో ల‌భించే రిక‌రింగ్ డిపాజిట్ సేవ‌ల‌లో కూడా మీరు డ‌బ్బులు పెట్ట‌వ‌చ్చు. ఇందులో మీరు రూ. 100 మొద‌లుకొని.. గరిష్ట పరిమితి లేకుండా ప‌దేళ్ల వ‌ర‌కూ మ‌నీ దాచ‌వ‌చ్చు. దీనికి 3 నుంచి 9 శాతం వ‌ర‌కూ వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇక ప‌న్ను మిన‌హాయింపు ఉన్న నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ) లో కూడా రూ.100 మొద‌లుకుని డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఈ స్కీమ్‌లో మీకు 6.8 శాతానికి పైగా వ‌డ్డీ ల‌భిస్తోంది. అయితే, ఎక్క‌డ మీరు మీ డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్నా.. వాటి గురించి ముందుగా తెలుసుకోవ‌డం ఉత్త‌మం.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju