టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన ప్రశ్నలు హీరోయిన్లను పలు ఇంటర్వ్యూలలో అడగడం చాలా మంది యాంకర్లకు బాగా అలవాటు అయ్యిందని చెప్పాలి. ఈ ప్రశ్నకు పోనీ హీరోయిన్లు ఏమైనా ఓపెన్ గా సమాధానం చెబుతున్నారా అంటే అది విన్న మనకు అస్సలు అది నిజం అనిపించదు. ఆ తరువాత అవకాశాలు రావేమో అనో లేకపోతే భయంతోనో వారు ‘ఇండస్ట్రీలో అలాంటిది ఏమీ లేదు’ అంటూ చాలా కూల్ గా సమాధానం ఇచ్చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఇదే విషయం గురించి ‘నేల టిక్కెట్’ మరియు ‘రెడ్’ సినిమాల హీరోయిన్ మాళవిక శర్మ స్పందించింది. ఇటీవల ఆమె మట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది అంటుంటారు కానీ నాకు అయితే అలాంటిది ఏమీ ఎదురవ్వలేదు. అలాగే మిగిలిన వాళ్ల గురించి నేను చెప్పలేను” అంటూ సమాధానం ఇచ్చింది. హీరోయిన్ మాళవిక నుకిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రెడ్’ చిత్రంలో చాలా డిఫరెంట్‌గా చూపించారట.
ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. ఈ సినిమా పై భారీ అంచనాలే వున్నాయి. మణిశర్మ సంగీతంలో తెరకెక్కిన పాటలు కూడా ఆ అంచనాలను పెంచేశాయట. ఇక ఈ సినిమాతోనైనా మాళవిక శర్మ కెరీర్ మలుపు తిరుగుతుందో లేదో చూడాలి మరి.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…