న్యూస్ సినిమా

ఇక జబర్దస్త్ కథ ముగిసినట్లేనా.. ఈ కామెడీ షో పని అయిపోయిందన్న స్టార్ కమెడియన్?

Share

బుల్లితెర టాప్ కామెడీ షో అనగానే గుర్తుకు వచ్చేది ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్. మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఫన్నీగా స్కిట్స్ చేయడం లేదా సినిమాల స్పూఫ్‌లు చేయడంలో జబర్దస్త్ కమెడియన్లు పెట్టింది పేరు. సొంతంగా స్క్రిప్ట్ రాసుకొని దానిని కామెడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలోనూ జబర్దస్త్ నటుల ముందుంటారు. ఈ కమెడియన్లు ఫుల్లు టాలెంట్ ఉన్నా ఎందుకో ఈమధ్య పేలవమైన స్కిట్స్ తో చిరాక్ పుట్టిస్తున్నారు. కొందరు మాత్రం బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

వెళ్లిపోతున్న ఫేమస్ కమెడియన్స్

Jabardasth
#Jabardasth

ప్రస్తుతం వినాయక చవితి స్పెషల్ సందర్భంగా జబర్దస్త్ కమెడియన్లు తమ స్కిట్స్‌తో ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ షోకి నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు. ఆ తర్వాత వారిద్దరూ షో నుంచి కొన్ని కారణాల వల్ల శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి ప్లేస్ లో ఇంద్రజ జడ్జిగా కంటిన్యూ అవుతుంది. ఆ తరువాత కోలీవుడ్ హీరోయిన్ ఖుష్బూ జబర్దస్త్‌కి జడ్జిగా వచ్చింది. అయితే వెళ్ళిపోయే వారి ప్లేస్ లో కొత్త వాళ్లు భర్తీ అవుతున్నా షోకి తలకాయలుగా ఉన్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్లు వెళ్ళిపోతూ షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఈ షోలో రాఘవ, చంటి, భాస్కర్, కార్తీక్, రాంప్రసాద్, రాకేష్, రోహిణి తదితరులు టీమ్‌ని లీడ్ చేస్తూ జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ లని ముందుకు లాగుతున్నారు.

జబర్దస్త్ పనైపోయింది!

Jabardasth Comedian Auto Ram Prasad
Jabardasth Comedian Auto Ram Prasad

నిన్న జరిగిన ఎపిసోడ్‌లో రంగ రంగ వైభవంగా సినిమా హీరోయిన్ వైష్ణవ్ తేజ, హీరోయిన్ కేతిక, దర్శకుడు గిరిశాయ తమ మూవీ ప్రమోషన్స్ చేసుకోడానికి వచ్చారు. షో స్టార్ట్ కావడానికి ముందు అందరూ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరం అండగా ఉంటూ జబర్దస్త్ షోని టాప్ ప్లేస్ కి తీసుకెళ్తామన్నారు. గెటప్ శ్రీను ఈ మాటలను చాలా ఎమోషనల్గా చెబుతుండగా.. రామ్‌ ప్రసాద్ జోక్యం చేసుకున్నాడు. “అందరూ జబర్దస్త్ పని అయిపోయిందని అంటున్నారు” అనే మాటా అతని నోటా వినపడగానే అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇలాంటి రూమర్స్ హల్చల్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయిందని.. కానీ అలాంటి పరిస్థితి జబర్దస్త్‌కి రాకుండా మేమంతా కష్టపడతామని అతడు చెప్పుకొచ్చాడు. ఈ షోని మంచి తాము ఒక మంచి పొజిషన్ కి తీసుకెళ్తామని ఇది నిజం అన్నాడు. వారితో పాటు రాకేష్, భాస్కర్, రష్మీ కూడా షోని నంబర్ వన్ ప్లేస్‌లో నిలబెడతామని ప్రేక్షకులకు మాట ఇచ్చారు.


Share

Related posts

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జిల మార్పు దేనికి సంకేతం?

Yandamuri

తెలంగాణ లో రికార్డు సృష్టించిన మందుబాబులు..!!

sekhar

Wamiqa Gabbi Joshful Looks

Gallery Desk