NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ..

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ .. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠూకూర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హజరైయ్యారు.  ప్రమాణ స్వీకారం అనంతరం సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠూకూర్ ను సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తదుపరి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠూకూర్ లతో తేనేటి విందులో సీఎం జగన్ పాల్గొన్నారు.

 

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తూ పదోన్నతిపై ఏపీ హైకోర్టు సీజేగా వచ్చారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. 1964 ఏప్రిల్ 25న జన్మించిన ధీరజ్ సింగ్ ఠాకూర్ 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్ననారు. 2011 లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన గత ఏడాది జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. దాదాపు ఏడాది పాటు అక్కడ సేవలు అందించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన  జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిన నేపథ్యంలో బాంబే హైకోర్టులో సీజే గా పని చేస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయన స్థానంలో నియమితులైయ్యారు.

Heavy Flood Flow: మున్నేటికి భారీగా వరద .. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వరద నీరు .. స్తంభించిన వాహనాల రాకపోకలు

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N