Karthika Deepam Jan11 Today episode: నిను వీడని నీడను నేనే అంటున్న మోనిత…మొత్తానికి ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరారుగా..!

Share

Karthika Deepam Jan11 Today episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో సౌందర్య, ఆనందరావు ప్రకృతి ఆశ్రమానికి వెళ్లడం చూసి కార్తీక్ ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అనుకుని అ కారుని పాలో అయి వెళుతుంది మోనిత.ఇక ఈరోజు ఎపిసోడ్ లో మోనిత బాబును కార్తీక్ ఆడిస్తుంటే దీప పాలు కలిపి తెస్తుంది.ఈ వయసులో పిల్లలు రాత్రంతా ఏడుస్తూ పెద్దవాళ్లని నిద్రపోనికుండా చేస్తారు కానీ వీడు మాత్రం అస్సలు ఏడవడు అంటుంది. ఏరా నువ్వు ఏడవ్వా అని కార్తీక్ అంటే..అరే అనకండి కార్తీక్ బాబు ఎందుకంటే వీడీపేరు మావయ్యగారి పేరే అంటుంది దీప.వీడు పేరు పెట్టి పిలిచినప్పుడు నీకు మావయ్య గారు గుర్తొస్తే..నాకు మాత్రం ఆ మోనిత గుర్తొస్తోంది అంటాడు కార్తీక్.

Deepti Sunaina: “తనతో అయినా నిజాయితీగా ఉండరా” దీప్తి సునైనా గుండెలు పిండేసే పోస్ట్!

Karthika Deepam Jan11 Today episode: మోనిత జ్ఞాపకాల్లో కార్తీక్ :

ఇంతదూరం వచ్చాక కూడా అవన్నీ ఎందుకు గుర్తుకు వదిలేయండి అంటే నా వల్ల కావడం లేదు దీప, మోనిత మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేసిందని కార్తీక్ అంటాడు. ఆనంద్ అని పిలిచినప్పుడు మావయ్యగారిని, ఆయనతో గడిపిన బాల్యాన్ని గుర్తుచేసుకోండి అంటుంది దీప.మరోపక్క సౌందర్య -ఆనందరావు కారుని వెంబడిస్తున్న మోనిత…బ్యాగ్ సర్దుకుని వెళుతున్నారంటే కార్తీక్ దగ్గరకే అయిఉంటుంది, మీరెక్కడికి వెళ్లినా మీ వెంటే ఉంటా…కార్తీక్ కనిపించగానే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతా అనుకుంటుంది.

Health Tips: ఇవి పాటిస్తే అనారోగ్యం మీ చెంతకు రాదు..!!
కార్తీక్ కు అబద్దం చెప్పిన దీప! ఏ విషయంలో అంటే..?

కట్ చేస్తే భోజనం వడ్డించా రండి అంటుంది దీప. మరి బియ్యం అంటే మధ్యాహ్నం బియ్యం కొనితీసుకొచ్చా అంటుంది. దీప నన్ను చంటిబిడ్డలా, అపురూపంగా చూడడం మానేసి నీ భర్తలా మాత్రమే చూడు అంటాడు. నేను రేపటి నుంచి పొరుగూరులో వంటపని చేయడానికి వెళుతున్నా అంటుంది దీప.హోటల్లో పనిచేస్తానంటే నా ఆరోగ్యం పాడవుతుందని మీరొప్పుకోరని నాకు తెలుసు అందుకే అబద్ధం చెబుతున్నా నన్ను క్షమించండి డాక్టర్ బాబు అనుకుంటుంది మనసులో దీప. అంతలోనే దీపా నీ ఆరోగ్యం జాగ్రత్త అంటాడు కార్తీక్.

తాడికొండ చేరిన మోనిత :

మోనిత మాత్రం సౌందర్య కారుని వెంబడిస్తు తాడికొండ గ్రామంలోకి ఎంట్రీ ఇస్తారు. తాడికొండా..ఇది ప్రియమణి వాళ్ల ఊరు కదా. అసలు సౌందర్య ఆంటీ వాళ్ళు ఇక్కడకు ఎందుకు వచ్చినట్టు, కొంపతీసి ప్రియమణి పార్టీ మార్చి వీళ్లకి హెల్ప్ చేస్తోందా ఏంటీ అనుకుంటుంది.ఇంట్లో పిల్లలకు టిఫిన్ లేకపోతే వండిన అన్నం తీసుకొచ్చి పెడతాడు.అన్నం జిగురుగా ఉందని పిల్లలు అంటే..భోజనాన్ని విమర్శించకూడదు తినండి అని చెబుతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప పంట బియ్యం అన్నం ఇలాగే ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంది. మరోపక్క ప్రకృతి వైద్యశాలకు చేరుకుంటారు సౌందర్య, ఆనందరావు. అది చూసిన మోనిత ఓరిని ఇందుకా వీళ్లు వచ్చింది. మావయ్యగారికి ఆరోగ్యం బాగాలేక ఇక్కడికి వచ్చారా..అయినా వీళ్ల జీవితాలు ప్రకృతికే అంకితం..నేను కార్తీక్ కే అంకితం అనుకుంటుంది. అయినాగానీ ప్రియమణిది ఇదే ఊరు కదా వెతికితే పోలా అనుకుంటుంది.

కార్తీక్ హోటల్లో పని చేస్తున్నా అని దీపతో చెబుతాడా?

నేను వచ్చి వంట చేసి పెట్టేదాన్ని కదా అంటే ఖాళీగా ఉన్నా రాజు రాజే కదా అంటుంది.కష్టాలు పిల్లలకు రేపు పాఠాలు నేర్పుతాయి అంటుంది దీప.మనకు డబ్బు మాత్రమే లేదు డాక్టర్ బాబు అన్న దీప సౌకర్యాలకు , విలాసాలకు అంతం ఎక్కడ. ఉంది చెప్పండి.బడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు, ఇప్పుడు జీవిత పాఠాలు ఇలా నేర్చుకుంటున్నారని చెబుతుంది. పిల్లల్ని స్కూల్ కి నేను వెళ్లి దింపి వస్తానులే అంటాడు కార్తీక్. నేను రావడానికి లేటవుతుంది కంగారు పడకు అని దీపతో చెబుతాడు ఈలోపు మనసులో దీప డాక్టర్ బాబు ఏదైనా పనిచేస్తున్నారా అనుకుని అడిగితే బాగోదులే బాధపడతారు అనుకుంటుంది దీప. ఇక్కడితే ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.రేపటి ఎపిసోడ్ లో మోనిత కంట దీప గాని,కార్తీక్ గాని పడతారా లేదా అనేది చూడాలి.!


Share

Related posts

పాపం.. పవన్ అంత పెద్ద తప్పు చేసారా..?

Special Bureau

ఛత్తీస్ గఢ్ లో హోరాహోరీ-ఎడ్జ్ కాంగ్రెస్ కే

Siva Prasad

Prabhas : బర్తడే నాడు శృతిహాసన్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ సినిమా యూనిట్..??

sekhar