20.7 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam serial November 2 episode : మోనిత చెంప పగలకొట్టిన దీప…సౌర్యను బందీ చేసిన చంద్రమ్మ..!

deepa punches to mounitha
Share

Karthikadeepam serial today episode review November 2 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1499వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 2 న ప్రసారం కానున్న Karthika Deepam serial,1499 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో శౌర్య కోసం ఆశగా ఇంద్రుడి ఇంటికెళ్లిన కార్తీక్, దీపలకు నిరాశే మిగిలింది.  అక్కడ సౌర్య లేదు అని తెలిసి నిరాశగా వెనుతిరుగుతారు దీప-కార్తీక్. ఇక దీప బాగా ఏడుస్తూ ఉంటే కార్తీక్ ఓదార్చుతాడు. ఇలా జరుగుతుంది అనుకోలేదు డాక్టర్ బాబు ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది శౌర్య అసలు ఇక్కడ ఉందా అనే అనుమానం వస్తుంది అంటే కార్తీక్ మాత్రం ఇక్కడే ఉందంటాడు. మీరు ఎలా చెబుతారని అడిగితే..నువ్వు నమ్ముతున్నావ్ కదా నేనుకూడా నీ నమ్మకాన్ని నమ్ముతున్నానని కవర్ చేస్తాడు.

ఇంద్రుడు, చంద్రమ్మలను నిలదీసిన సౌర్య:

sourya with durga, chandramma
sourya with durga, chandramma

ఇక ఫంక్షన్ అంతా అయిపోయాక శౌర్యకి ఇంద్రమ్మ దిష్టి తీస్తుంది.ఆ తర్వాత శౌర్య ఫంక్షన్ ఇంతబాగా చేశారు కదా మీకు ఈ డబ్బులు, నగలు ఎక్కడివి అని ఇంద్రుడు, చంద్రమ్మలను నిలదీస్తుంది.దొంగతనం చేశారా అని శౌర్య నిలదీస్తుంది.లేదు అమ్మా మేము ఎక్కడ దొంగతనాలు చేయలేదు. నీవు మా దగ్గరకు వచ్చినప్పటినుండి మేము దొంగతనాలు మానేసాము అంటారు.ఆ రోజు వాటర్ బాటిల్ కొనిచ్చింది కదా ఆ అమ్మలాగే వేరే తల్లిదండ్రులు ఇలా సహాయం చేశారని చెప్పి కవర్ చేస్తాడు ఇంద్రుడు. నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు ఎలాగయినా ఇబ్బందే కదా అని బాధపడుతుంది శౌర్య…నేను పుష్పావతి అయ్యాను అని మా అమ్మానాన్నలకు తెలిస్తే వాళ్ళు ఇంకా ఎంత సంతోషించే వారో అని బాధపడుతుంది. ఈరోజు నాకు మా అమ్మ నాన్న వచ్చినట్టు అనిపించింది బాబాయ్.ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి సమయంలో అమ్మానాన్న పక్కన ఉండాలని కోరుకుంటుంది కదా కానీ నేనేం పాపం చేశాను బాబాయ్ అని బాధపడుతుంటే ఇంద్రమ్మ దంపతులు కూడా బాధపడుతూ సౌర్యను ఓదార్చుతారు.

దీపను ఓదార్చిన దుర్గ:

deepa crying
deepa crying

ఇక గుండె నిండా బాధతో ఇంటికెళ్లిన దీప అదే బాధలో ఉండిపోతుంది. పక్కనే దుర్గ కూర్చుని దీపను ఓదార్చుతూ ఉంటాడు. లేదు దుర్గా..నా జీవితంలో ఏదీ అనుకున్నట్టుగా జరగలేదు. అక్కడ శౌర్య ఉంటుంది అనుకుని వెళ్తే అక్కడ లేదు అని బాధపడుతుంది.శౌర్య దొరుకుతుందిలే..నీ బిడ్డనుకుని వెళ్లావ్ కానీ కాదు ఏం చేస్తాం..అన్నీ అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది అని అంటాడు దుర్గ.అన్నీ అనుకున్నట్టు జరగాల్సిన అవసరం లేదు..కానీ కొన్నైనా జరగాలి కదా..నా జీవితంలో ఏదీ అనుకున్నట్టు జరగడం లేదు అని వాల్తేరు వాణి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అంటుంది. మీరు పొద్దున్న పాప దగ్గరకు వెళ్తున్నారని చెప్పలేదు దీపమ్మ అంటూ జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు.. మనల్ని చంపమని మోనిత పంపిన మనిషే అ వాణి అని చెప్పగానే
దీప షాక్ అయ్యి కోపంతో ఆ మోనిత ఇంటికి వెళుతుంది.

మోనిత చెంప పగలకొట్టిన దీప :

deepa slabs to mounitha
deepa slabs to mounitha

సీన్ కట్ చేస్తే మోనితని చూసి శివ భయపడుతూనే తినండి మేడం అని అంటాడు. నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే నీ ప్రాణాలు తీస్తా అనడంతో శివ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక మోనిత ఆలోచనలో పడుతుంది.ఇంతలోనే అక్కడికి వచ్చిన దీప లాగిపెట్టి కొట్టడంతో మోనిత చెంప చెళ్లు మంటుంది.ఎందుకు కొట్టావ్ అంటే..నా ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తావా అంటూ వాల్తేరు వాణి గురించి చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది. అవును నేను నిన్ను చంపడానికే వాల్తేరు వాణిని రప్పించాను కానీ నువ్వు తప్పించుకున్నావు.. అయినా నిన్ను అంత ఈజీగా వదలను దీప. కార్తీక్ నా వాడు…నా సొంతం  అంటుంది మోనిత.. ఇక మోనిత మాటలకూ దీప చీదరించుకుంటూ ఇద్దరు పిల్లలు గల తండ్రిని ఇష్టపడుతున్నావు దానిని మరొక లాగా పిలుస్తారు అని, నువ్వు చేసిన పని గురించి డాక్టర్ బాబుకు చెబుతాను ఆయన ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది.దీప మాటలకూ కంగారు పడిన మోనిత ఇప్పుడే నేను నిన్ను చంపేస్తానని మోనిత అరవడంతో దీప మళ్ళీ మోనితకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

సౌర్య కోసం కార్తీక్ వెతుకులాట:
durga karthik conversation
durga karthik conversation

తరువాత సీన్ లో ఇంద్రుడు పని వాళ్లకు డబ్బులిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి కార్తీక్ మళ్ళీ వస్తాడు. అది చూసి ఇంద్రుడు ఏంటి సార్ మళ్లీ వచ్చారు అని షాక్ అయ్యి దగ్గరకు వెళ్తాడు.కొన్ని నిజాలు తెలుసుకుందామని అని చెప్పి వారణాసి ఫోటో చూపిస్తాడు కార్తీక్. వారణాసి ఫోటో చూసి ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అయి తెలియదు అని కావాలనే అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు ఇంద్రుడు.

తండ్రికి కనబడవ్వకుండా సౌర్యను దాచేసిన చంద్రమ్మ :
sourya arrested by chandramma
sourya arrested by chandramma

అప్పుడు శౌర్య కిటికీ లో నుంచి కార్తీక్ వైపు చూస్తూ ఉండగా కావాలని ఇంద్రమ్మ అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లిపోయి గదిలో ఉంచి అన్నం పెడుతూ ఉంటుంది.కార్తీక్ వెళ్లిపోవడంతో లోపలికి వచ్చిన ఇంద్రుడుని ఎవరితో మాట్లాడుతున్నావు బాబాయ్ అని అడిగితే..నీకు నగలు కొనిచ్చారని చెప్పాను కదమ్మా ఆయనతో మాట్లాడుతున్న అంటే అలా అయితే థ్యాంక్స్ చెప్పేదాన్ని కదా బాబాయ్ అంటూ శౌర్య బయటకు వెళ్ళబోతుంటే లేరు వెళ్లిపోయారు అంటాడు.ఎందుకొచ్చారని ఇంద్రమ్మ అడిగితే…వారణాసి, శౌర్య ఫొటోలు చూపించి అడిగారని ఇంద్రుడు చెబుతాడు. ఇంకా మనపై అనుమానం ఉందేమో మనం జాగ్రత్తగా ఉండాలి అంటుంది చంద్రమ్మ.

 


Share

Related posts

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సండే స్పెషల్ స్టోరీ..! వచ్చేవారం ఈ ట్విస్ట్ ఉంటుందని ఊహించారా.!?

bharani jella

Chandrababu : బాబుకు ఘోర అవ‌మానం… తిరుప‌తి ఓట‌మి కంటే ముందే ఏం జ‌రిగిందంటే..

sridhar

బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం హేమంత్

somaraju sharma