NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

KCR : బిజెపి, షర్మిల కలిసి కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు గా…

AP Politics : News Strategy in Politics

KCR : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేసీఆర్ కు సరైన పోటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఎదగడంలో విఫలం కావడంతో టిఆర్ఎస్ పార్టీ వారు ఆడిందే ఆట పాడిందే పాటగా అక్కడ ఇన్నిరోజులు రాజకీయం కొనసాగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ కి ఉన్నట్టుంది గడ్డు పరిస్థితి ఎదురయింది.

KCR under pressure by BJP Sharmila
KCR under pressure by BJP Sharmila

దుబ్బాక ఉప ఎన్నికల షాక్, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాల గుర్తులు మరిచిపోకముందే అతనిని కోలుకోనివ్వకుండా ఒక వైపు బిజెపి మరోవైపు వైఎస్ షర్మిల దాడి చేస్తున్నారు. బిజెపి వారేమో వీలుచిక్కినప్పుడల్లా కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మంత్రి కేటీఆర్ అయితే ఈమధ్య సహనం కోల్పోయి బిజెపి వారిపై అనూహ్య రీతిలో ఎదురుదాడి దిగిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని ఎవరైనా అడిగితే ఎడమకాలు చెప్పు ని చూపించండి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అది కేసీఆర్ పైన సెటైర్ అయినప్పటికీ టిఆర్ఎస్ వారికి ఆ మాటలు బాగానే గుచ్చుకున్నాయి.

ఇక వై యస్ షర్మిల విషయానికి వస్తే తెలంగాణలో ఎవరూ తమ స్థానికతను ప్రశ్నించే హక్కు వారికి లేదని గట్టి రిప్లై ఇచ్చారు. కెసిఆర్, విజయశాంతి ఎక్కడ పుట్టారు అని ఆమె అడిగిన ప్రశ్నకు సమీడియా నుండి మాధానం రాలేదు. కెసిఆర్ పరిపాలన పై ఆమె విమర్శలతో కూడిన ఆరోపణలు సంధించారు కరోనా సమయంలో జనాలంతా అల్లాడిపోతుంటే కేసీయార్ ఏమన్నా పట్టించుకున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు.

లక్షలకు లక్షలు దోచుకున్న ఆస్పత్రుల పై కూడా ఆయన దృష్టి పెట్టలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమై పోయిందని చెప్పిన ఆమె త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర కూడా చేయబోతున్నట్లు తెలిపింది. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తే అది కేసీఆర్ కు మరొక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే విద్యార్థుల దృష్టి తనవైపు తిప్పుకున్న షర్మిల తెలంగాణ రాష్ట్రం మొత్తం కాలి నడకన తిరిగితే టిఆర్ఎస్ క్యాడర్ పైన తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. మరోవైపు బిజెపి అనూహ్య రీతిలో పుంజుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్ తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి వీరిద్దరినీ నిలువరించకపోతే అతని సీఎం కుర్చీకే ప్రమాదం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N