Keerthi suresh: కీర్తి సురేశ్ చేసిన ఆ పొరపాట్ల వల్లే వరుసగా ఫ్లాప్స్ వచ్చి కెరీర్ కష్టాల్లో పడింది

Share

Keerthi suresh: కీర్తి సురేష్..తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ మొత్తంగా మహానటి సినిమాకి ముందు ఆ తర్వాత అనేట్టుగా దేశవ్యాప్తంగా ఊహించని రేంజ్ లో పాపులారిటీ అండ్ క్రేజ్ తెచ్చుకున్నారు. కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ మేకర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలతో ఇంకాస్త క్రేజ్ పెంచుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాపయినప్పటికీ త్రివిక్రం చూపించిన విధానానికి కీర్తి బాగా హైలెట్ అయింది.

keerthi-suresh career is lost due to these mistakes
keerthi-suresh career is lost due to these mistakes

అలా తెలుగులో అలాగే తమిళంలో భారీ క్రేజ్ తెచ్చుకొని కమర్షియల్ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమా కీర్తి సురేష్ కి ఎప్పటికీ చెరగని క్రేజ్ తెచ్చి పెట్టింది. సౌత్ ఇండస్ట్రీల పరంగా నంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల నుంచి సత్కారాలు పొందింది. అప్పటి వరకు కీర్తికి భారీ హిట్స్ ఉన్నాయి. కానీ మహానటి మాత్రం తన కెరీర్ లో మైల్ స్టోన్‌ మూవీగా నిలిచింది.

Keerthi suresh: కీర్తి మహానటితో మరోస్థాయికి చేరుకుంది.

అయితే అప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి మహానటితో మరోస్థాయికి చేరుకుంది. ఈ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాలకంటే కూడా వరుసగా మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేసేందుకు సైన్ చేసింది. కీర్తి సురేశ్ ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక గత ఏడాది కరోనా వల్ల సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కాలేదు. అయితే మహానటి కీర్తి సురేశ్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం ప్రముఖ ఓటీటీలో విడుదలయ్యాయి.

కరోనా క్రైసిస్‌లో రెండు సినిమాలతో కీర్తి వస్తుందని అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ అనూహ్యంగా కీర్తి నుంచి వచ్చిన రెండు సినిమా ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్నాయి. గర్భినీ స్త్రీ పాత్రలో కీర్తి నటించింది. ఇది ఒకరకంగా ప్రయోగం అని చెప్పాలి. కమర్షియల్ హీరోయిన్ గా ఉన్న క్రేజ్ ఇలా ఉపయోగించుకోవాలనుకుంది. కానీ రివర్స్ లో షాక్ తగిలింది. పెంగ్విన్ అంటూ వచ్చిన కీర్తి ఫ్లాప్ మూటకట్టుకుంది.

Keerthi suresh: కీర్తినే అందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.

ఇక ఈ సినిమా తర్వాత మిస్ ఇండియా అనే మరో సినిమాతో వచ్చింది కీర్తి సురేశ్. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కాస్తో కూస్తో పెంగ్విన్ నయమని చెప్పుకున్నారు. అంటే ఎంత ఘోరమైన టాక్ తెచ్చుకుందో అర్థం చేసుకోవచ్చు. బలమైన కథ లేకుండా మిస్ ఇండియా సినిమా తీశారని విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో కీర్తినే అందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం బొద్దుగా ఉన్న కీర్తి కఠినంగా డైట్ చేసి మరీ బక్క పలచగా తయారైంది.

కానీ కీర్తి సురేశ్ ని ఫ్యాన్స్ ఇలా చూడటానికి అసలు ఇష్టపడలేదు. అంతేకాదు మళ్ళీ ముందులాగా బొద్దుగా కావాలని ఫ్యాన్స్ సలహాలు కూడా ఇచ్చారు. ఇక కమర్షియల్ సినిమాగా వచ్చిన రంగ్ దే హిట్ అనే టాక్ తెచ్చుకుంది. కానీ కీర్తికి దక్కాల్సిన సక్సెస్ మాత్రం దక్కలేదు. ఇక మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖీ రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు కీర్తి ఆశలన్నీ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా మీదే పెట్టుకుంది. అలాగే రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో కీలక పాత్రల్లో కనిపించబోతోంది. మొత్తానికి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకొని పొరపాటు చేసిన కీర్తి దానిని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉంది.


Share

Related posts

Supreme Court: బోర్డు పరీక్షల రద్దు పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..!!

somaraju sharma

Justice NV Ramana: పార్లమెంట్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

somaraju sharma

కేంద్రానికి అసలు రైతులతో చర్చించడమే ఇష్టం లేదా..? ఏమిటీ ప్లాన్?

siddhu