నందమూరి నటవారసుడిగా వెండితరకు పరిచయమైనప్పటికీ.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. బాలరామాయణం సినిమాతో సీని రంగంలోకి అడుగుపెట్టిన ఆయన స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి చిత్రాలలతో యంగ్ టైగర్‌గా పెరుతెచ్చుకున్నాడు తారక్. ఆంధ్రవాలా, టెంపర్, జనతా గ్యారేజ్, బృందావనం యమదొంగ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి, టాలీవుడ్లో అగ్ర కథానాయకులలో ఒకరిగా క్రేజ్ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. అత్యంత భారీ బడ్జెట్‌తో దర్శక ధీరుడు జక్కన తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా స్వతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన ఇతివృత్తాన్ని అధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. తెగులు, హిందీ, తమిళం, మలయాళం సహా దాదాపు 11కు పైగా భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను తీస్తుండటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా పూర్తి కానప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాత్రికుడు, టాప్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
తారక్‌ను దృష్టిలో ఉంచుకుని అద్దిరిపోయే స్టోరీని సిద్ధం చేశారట త్రివిక్రమ్. ఇది రాజకీయాల నేపథ్యంలో ఉండనుందనీ, భారీ బడ్జెట్‌తో తీయబోతున్నారని ఇటు మీడియా అటు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా, ఇందులో నటించే నటుల గురించి, యంగ్ టైగర్‌తో జోడి కట్టే ముద్దుగుమ్మకు సంబంధించిన పలు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వారిలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడి సినిమా “రోమాంటిక్” చిత్రంతో తెగులు తెరకు పరిచయమవుతోన్న ఉత్తరాది భామ కేతిక శర్మ పేరు వినిపిస్తోంది.
మోడల్‌గా కెరియర్ ప్రారంభించి వెండితెరకు పరిచమైన ఈ భామ తన హాట్ హాట్ ఆందాలతో కుర్రకారు మతిపోగోడుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా ఉంటోంది. అయితే, త్రివిక్రమ్ తీయబోయే చిత్రంలో ఎన్టీఆర్‌కు జతగా కేతిక శర్మ నటించబోతున్నదని టాక్. ఇటీవల స్టైల్ స్టార్ అల్లు అర్జున్, కేతిక శర్మలు కలిసిన నటించిన ఓ యాడ్‌కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌కు జతగా కేతిక శర్మ సరిజోడిగా ఉంటుందనుకునే ఆమెను ఎంపికచేసి ఉంటారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!