Telangana : 2018 వ సంవత్సరం లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వటం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని కేసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు మంత్రి కేటీఆర్ మొన్నామధ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్న ట్లు అప్పట్లో కీలక కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి పథకం దేశంలో రెండు మూడు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరు అన్న దాని విషయంలో గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే బట్టి చూస్తే రాష్ట్రంలో 11 నుండి 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి విషయంలో ఎంత మందికి ఇస్తారు..? ఎంత ఇస్తారు అన్న దాని విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నిరుద్యోగ భృతి కింద కెసిఆర్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త టాక్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వర్గాల లో వినపడుతోంది. గుజరాత్ వంటి రాష్ట్రాలలో నిరుద్యోగ భృతి విద్యార్హత బట్టి మూడు వేల నుండి పదివేల ఇస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా గుజరాత్ మాదిరిగానే మొదట మూడు వేల రూపాయల నుండి స్టార్ట్ చేసి విద్యార్హత బట్టి నిరుద్యోగ భృతి కల్పించే ఆలోచన కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.