తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎంగా కేటీఆర్ .. ముహూర్తం ఫిక్స్..??

Share

టిఆర్ఎస్ పార్టీలో సీఎంగా కేటీఆర్ అనే చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న కేటీఆర్ కి ముఖ్యమంత్రి అవటానికి అన్ని అర్హతలు ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వరుసగా ఇటీవల డైలాగులు వెస్తున్నారు. గతంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్.

Telangana people smarter to outwit anyone with divisive agenda': KTR takes  dig at BJP | The News Minuteఆ తరుణంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టత ఇవ్వటంతో కేటీఆర్ సీఎం అంటూ వస్తున్న వార్తలు ఆగిపోయాయి. మరి తాజాగా ఏమైందో ఏమో తెలియదు గానీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం అంటూ బలమైన స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ తరుణంలో పార్టీలో ఉన్న కొంతమంది నేతలు వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ సభా నాయకత్వాన జరగాలని అంటున్నారు.

 

ఇదే సరైన టైమ్ అని కేటీఆర్ ని సీఎం చేయాలని మంత్రి ఈటెల రాజేందర్ ఇంకా మరి కొంతమంది అంటున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యల వెనకాల పెద్ద అండర్ గ్రౌండ్ స్కెచె టిఆర్ఎస్ పార్టీ నేతలు వేసినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేటర్ లోకి వెళ్తే ఇప్పటినుండే కేటీఆర్ కి భజన చేస్తే .. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన క్యాబినెట్లో మంత్రి బెర్తులు కన్ఫామ్ అయ్యేవిధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అందువల్లే టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పోటాపోటీగా కేటీఆర్ సీఎం అనే సరికొత్త కోరస్ ఎత్తుకున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్.


Share

Related posts

తన జీవితంలో ఎవ్వరికీ చెప్పని నిజాలు బయటపెట్టిన కార్తీకదీపం వంటలక్క…

Naina

స్టార్ హీరో కి వార్నింగ్ ఇచ్చిన పూరి జగన్నాథ్..!!

sekhar

మొత్తం మీద రఘురామకృష్ణం రాజు ని పీకి పడేశారు !

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar