NewsOrbit
న్యూస్

Big Breaking Lock Down: మళ్ళీ లాక్ డౌన్..!? మే నెలలో తప్పదేమో..!?

Big Breaking Lock Down: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ కేంద్రం దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి.తిరిగి లాక్డౌన్ విధించే అవకాశాలు లేవని ప్రధాని ఈమధ్య జాతికి ఇచ్చిన సందేశం లో పేర్కొన్నప్పటి అందుకు భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి.కరోనా ఉద్ధృతి రోజు రోజుకు పెరిగిపోతోంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.ఈ నేపధ్యంలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 2 తరువాత ఏ రోజైనా లాక్ డౌన్ ప్రకటన రావొచ్చు. ప్రధాని నరేంద్రమోదీ గత నాలుగురోజులుగా వరుస భేటీల సారాంశమిదే.. ఇవీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్న ఊహాగానాలు.

Lock Down Again ..!? Must be in the month of May ..!?
Lock Down Again ..!? Must be in the month of May ..!?

అనేక రాష్ట్రాలు అతలాకుతలం!

భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు తప్పక దాపురిస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ మరింత బలంగా మారుతుందంటున్న వైద్య నిఫుణుల మాటలూ లాక్ డౌన్ విధింపు రూమర్లకు బలం చేకూరుస్తోంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల కరోనా విషయానికి వస్తే, ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ ఉందని నిర్ధారణ చేసినట్టు సమాచారం. చాలా వేగంగా వ్యాప్తి చెందే దక్షిణాఫ్రికా రకం వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోవైపు హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి. ఇక, దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 63 శాతం కేసులు ఉండటం గమనార్హం. అటు, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో కూడా కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా నైట్ కర్ఫ్యూ లు అమలు చేస్తుండగా, స్వచ్ఛందంగా గ్రామాల్లో కూడా లాక్ డౌన్ విధించుకుంటున్నారు జనం.

ఆ రోజున ముహూర్తం?

మే 2వ తేదీన పూర్తి కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే దేశంలోని పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మే, జూన్ నెలలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున.. సుమారు 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చనున్నట్టు కేంద్రం నిన్న ప్రకటించడం కూడా దేశ వ్యాప్త లాక్‌ డౌన్‌ కోసమేనని ప్రచారం జోరుగా సాగుతోంది.

 

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju