NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే భావిస్తారు. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లో ఓ నాయకుడి దంపతులు పార్టీ కండువా కప్పుకున్నా పార్టీలో చేరినట్లు కాకుండా అయిపోయింది. సదరు నేత చేరిక వ్యవహారం వివాదాస్పదం కావడంతో పార్టీ కీలక నేత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నా.. చేరికకు బ్రేక్ పడింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వివిధ కారణాలతో పార్టీని వీడిన వారు తిరిగి వస్తామంటే చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ చేరిన వారిలో కొందరు అధికార పార్టీలో ఉంటే సేఫ్ అని తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఆయన భార్య మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ నాగలక్ష్మి వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి చేరికను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

దీంతో భార్గవ్, ఆయన సతీమణి నాగలక్ష్మి, 13 మంది కౌన్సిలర్ లు శనివారం నేరుగా హైదరాబాద్ చేరుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే తమకు సంప్రదించకుండా వీరిని పార్టీలో చేర్చుకోవడంపై జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆదేశాల మేరకు చేరికలను తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత చేరికల తేదీని ప్రకటిస్తామని, అప్పటి వరకూ భార్గవ్ చేరిక నిలుపుదలలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  ఈ పరిణామంతో భార్గవ్ దంపతులు జిల్లా నేతలను ప్రసన్నం చేసుకుని మరో సారి కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడుతోంది.

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?