NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ పర్యటన ఖరారు కాగా.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ కూడా ఖరారు అయ్యింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కంటే ముందుగానే అమిత్ షా రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్నారు. 5వ  తేదీ ఆదివారం (రేపు) రాయలసీమలోని ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి అమిత్ షా వస్తున్నారు. కూటమి తరపున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు మద్దతుగా అమిత్ షా ప్రచారానికి వస్తున్నారు.

ఆదివారం (రేపు) ధర్మవరానికి అమిత్ షా వస్తున్నట్లు తమకు సమాచారం వచ్చినట్లు రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు ధర్మవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఢిల్లీ నుండి ధర్మవరం చేరుకోనున్న అమిత్ షా . సత్యకుమార్ కు మద్దతుగా ధర్మవరం బత్తలపల్లి రోడ్డులోని సీఎస్బీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అమిత్ షా తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సభలో పాల్గొననున్నారు.

మరో వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం (ఎల్లుండి) రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. మే 6న (సోమవారం) ఢిల్లీ నుండి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సభా వేదిక ఏర్పాటు చేస్తున్న వేమగిరికి చేరుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి హెలికాఫ్టర్ లో అనకాపల్లి వెళతారు. అక్కడ రాత్రి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ కి వెళ్లిపోతారు.

అనంతరం తిరిగి మే 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు రానున్న ప్రధాని మోడీ.. 3 గంటలకు పీలేరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుండి సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయవాడకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. తదుపరి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు.

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Related posts

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju