Bala Krishna: బాలయ్య బాబు కెరీర్ ప్రస్తుతం చాలా డిజాస్టర్ లో ఉంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ పడి చాలా కాలం అయ్యింది. పైగా 2019 ఎన్నికల టైంలో నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించి దారుణమైన అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో బోయపాటి తో బాలయ్య సినిమా ఒప్పుకోవడంతో “అఖండ” సినిమా హిట్ అవ్వాలని, బాలయ్య బాబు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని బోయపాటి తో హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్, సింహ.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డు సృష్టించడంతో.. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న “అఖండ” సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా డిఫరెంట్ గా ఉండటం మాత్రమే కాక.. సోషల్ మీడియాలో అనేక రికార్డు.. సృష్టించడంతో సినిమా రిలీజ్ కోసం నందమూరి ఫాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా కరోనా కష్టాలు ఎదుర్కుంటూ .. ప్రస్తుతం ఫైనల్ ఫినిషింగ్ టచ్ కి వచ్చేయడం జరిగింది.
Read More: Akhanda: బాలకృష్ణ “అఖండ” సీక్రెట్స్ బయటపెట్టిన శ్రీకాంత్..!!
పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. పాటు రాష్ట్రాలలో కూడా కేసులు తగ్గిపోవటంతో బాలయ్య బాబు బోయపాటి కలిసి.. ఒకే షెడ్యూల్ లో.. మిగిలిన బ్యాలెన్సింగ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే.. మిగిలి ఉండటంతో కొద్దిరోజుల్లోనే వాటిని కంప్లీట్ చేయడానికి బాలయ్య రెడీ అయినట్లు ఫిలిం వర్గాల టాక్. సినిమా మొత్తానికి ఇవే హై ఓల్టేజ్ సన్నివేశాలు అని మేకర్స్ అంటున్నారు.