Bheemla nayak: ‘భీమ్లా నాయక్’ సినిమాకు సంబంధించి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చెప్పుకుంటున్న సాలీడ్ అప్డేట్ను చిత్ర నిర్మాత ఇచ్చి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా ‘రాధేశ్యామ్’, ‘ఆర్ ఆర్ ఆర్’ వల్ల రిలీజ్ వాయిదా పడాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాల రిలీజ్ వాయిదా పడినప్పటికీ పవన్ సినిమా మాత్రం సంక్రాంతికి రాలేకపోయింది. అయితే, ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ చిత్ర బృందం నుంచి సాలీడ్ అప్డేట్ రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా ఆధారంగా తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా మరో హీరోగా నటించారు.
మలయాళ భామలు నిత్యమీనన్, సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. ఇక ఈ సినిమాకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శక రచయిత.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లేతో పాటు మాటలు, రచనా సహకారం, ఓ పాటను అందించారు. ఇక ఈ సినిమా
విషయంలో ఎక్కువగా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 25న కానీ ఏప్రిల్ 1న కానీ రిలీజ్ చేయబోతున్నారని మేకర్స్ ఆల్రెడీ వెల్లడించారు.
Bheemla nayak: భీమ్లా నాయక్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్.
ఇటీవలే ఏపీలో ఉన్న టికెట్ ధరలతో పాటు ఇతర విషయాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలోనే 25వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. అంతేకాదు నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఇప్పుడు ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారని అధికారికంగానే ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే మిగతా సౌత్ భాషలైన తమిళం, మలయాళం, కన్నడ భాషాలో కూడా డబ్బింగ్ వెర్షన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తారని అంటున్నారు. ఇప్పటికే పవన్ సినిమా అంటే దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అంటే ఇక ఆయన తర్వాతే ఎవరైనా అని అభిమానులు చెప్పుకుంటున్నారు.