NewsOrbit
న్యూస్ సినిమా

# RC 15: చరణ్ లుక్స్ మీదే దర్శకుడి శంకర్ కసరత్తులన్నీ..కమల్, రజనీలను మించి చూపించబోతున్నారు..

# RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నారా? ఇప్పుడు అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శంకర్..ఆయన తెరకెక్కించే సినిమాలలో హీరో పాత్రను విభిన్న కోణాల్లో ఆవిష్కరించడం ప్రత్యేకత. ఇప్పటి వరకు రజనీకాంత్, అర్జున్, విక్రమ్ వంటి స్టార్ హీరోలను ఎంత విలక్షణంగా ప్రెజెంట్ చేశారో అందరికీ తెలిసిందే. రోబో – ఐ – 2.0 వంటి భారీ చిత్రాలలో శంకర్ హీరోలను ఎంత వెరైటీగా చూపించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్సి 15 అంతకమించి అనేట్టుగా శంకర్ చరణ్‌ను రెండు విభిన్న పాత్రల్లో చూపించబోతున్నారట.

director shanker mainly working on charan looks
director shanker mainly working on charan looks

క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా, చరణ్ ఈ తాజా షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇక తాజా సమాచారం మేరకు.. చరణ్ ఆర్సి 15 సినిమాలో డ్యూయల్ లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ రెండు లుక్స్‌లో చాలా వేరియేషన్ ఉంటుందని సమాచారం. ఇందులో ఒక లుక్ బ్యూరోక్రాట్‌గా కనిపించనుండగా.. మరో లుక్‌లో క్యాజువల్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడట. ఆర్సి 15 పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా.

# RC 15: సంక్రాంతికి రిలీజ్ అవుతుందా..?

ఈ సినిమా కోసం దిల్ రాజు తన సోదరుడు శిరీష్‌తో కలిసి దాదాపు రూ 400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా 2023 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుందని అఫీషియల్‌గా నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. అయితే, శంకర్ భారతీయుడు 2 చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంది. అలాగే, బాలీవుడ్‌లో అపరిచితుడు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా సెట్స్ మీదకి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ప్రకటించినట్టు ‘ఆర్సి 15’ 2023, సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా చూడాలి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar