RRR: ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా అంటే నిర్మాత పెట్టిన పెట్టుబడి కంటే కూడా డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుబడే తిరిగి వస్తుందా లేదా అనే కంగారు ఉంటుంది. ఇప్పుడు అదే కంగారు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్‌లో కలిగి కలవరపడు తున్నారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా వేవ్స్ కారణంగా చిత్ర పరిశ్రమలో ఎలాంటి ఆర్ధిక నష్ఠాలు వాటిల్లాయో అందరికీ తెలిసిందే. గడిచిన రెండున్నరేళ్ళుగా కొన్ని వేల కోట్ల వ్యాపారం దెబ్బ తిన్నది.
ఇక కరోనా థర్డ్ వేవ్ తర్వాత మళ్ళీ కాస్త పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దాంతో చిన్న, మీడియం, భారీ బడ్జెట్‌తో నిర్మించిన పాన్ ఇండియన్ సినిమాలు ఒక్కోటి థియేటర్స్‌లో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అన్నీ భాషల నుంచి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన సక్సెస్ సాధించలేక పోతున్నాయి. ఇక ‘భీమ్లా నాయక్’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చి వసూళ్ళ పరంగా మాత్రం కాస్త నిరాశ పరచాయి.
RRR: ఇప్పటికే ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అని అందరూ చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్‌కు తీవ్రంగా నష్టం వచ్చింది మాత్రం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా వల్లే. అన్నీ చోట్లా ఈ సినిమా ఫ్లాప్ టాక్‌నే మూటగట్టుకుంది. ఇక ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఏపీలో టికెట్ రేట్స్ కారణంగా కొంత నిరాశ తప్పలేదు. ఇప్పుడీ రెండు సినిమాల ప్రభావం ఆర్ఆర్ఆర్ మూవీపై గట్టిగా పడే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఒకేవళ ‘రాధేశ్యామ్’ మాదిరిగా టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ తట్టుకోగలరా అని ముందే నిర్మాతను కాస్ట్ కటింగ్ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నారట. కానీ, నిర్మాత మాత్రం ససేమిరా అంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అని అందరూ చెప్పుకుంటు న్నారు. కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అనే చెప్పొచ్చు.