Ram Charan: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు చెర్రీ. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు చరణ్. ఇక రాంచరణ్ తాజాగా నటిస్తున్న మూవీ ” గేమ్ చేంజర్ “.
ఈ సినిమాపై చెర్రీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఆటోగ్రాఫ్ గురించి లేదా ఈనని చూసేందుకు తెగ ఉర్రూతలూగుతారు అభిమానులు. ఇక కొన్ని కొన్ని సార్లు కొంతమంది అభిమానులు సెలబ్రిటీలను ఇబ్బందులకు కూడా గురి చేస్తుంటారు. ఇక తాజాగా రామ్ చరణ్ విషయంలో కూడా అదే జరిగింది.
షూటింగ్ ముగించుకుని వస్తున్న చరణ్ కారును కొంతమంది ఫ్యాన్స్ వెంబడించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వరకు అలాగే ఫాలో అయ్యారు. అది గమనించి చరణ్ కారును స్లో చేయించి.. కార్ గ్లాస్ ని కిందకు దించి వారందరికీ అభివాదం చేసి.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని కోరాడు.
ఇక ఫాలో అవుతుంటే మరింత స్పీడ్ పెంచి చరణ్ కారు ముందుకు తీసుకువెళ్తారు అనుకుంటే.. కారు స్లో చేయించి మరీ పలకరించడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని చూసిన వారంతా చరణ్‌ది గొప్ప మనసు అంటూ తెగ పొగిడేస్తున్నారు.
From Shooting Location Few Fans Followed Charan Babu Car He Wished them & Said Carefull While Driving .#RamCharan #GameChanger pic.twitter.com/z5r7xcJ87d
— Praveen (@AlwaysPraveen7) January 19, 2024