NewsOrbit
సినిమా

Jr Ntr rejected movies : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న ఈ సినిమాల గురించి తెలిస్తే అభిమానులు తీవ్ర నిరాశ పడతారు.. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటో చూద్దాం..!

from-mahesh-babu-srimanthudu-to-nithiin-dil-these-9-movies-rejected-by-young-tiger-jr-ntr

Jr Ntr rejected movies : ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. కానీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గురించి ఒక మాట ఎప్పుడూ వినబడుతూంటుంది. ఎన్టీఆర్ ఏదైనా సినిమాల కథ విని ఆ సినిమా చేయకుండా వదులుకుంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుంది. ఈ విధంగా ఎన్టీఆర్ కథలు విని చేయకుండా వదులుకున్న సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ చేయకుండా వదిలేసిన ఆ సూపర్ హిట్ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

from-mahesh-babu-srimanthudu-to-nithiin-dil-these-9-movies-rejected-by-young-tiger-jr-ntr
from-mahesh-babu-srimanthudu-to-nithiin-dil-these-9-movies-rejected-by-young-tiger-jr-ntr

1) దిల్ :నితిన్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సినిమా “దిల్”. 2003లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ముందుగా ఈ సినిమాను దర్శకుడు ఎన్టీఆర్ చెప్పగా ఎన్టీఆర్ ఈ సినిమాను చేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోగా నితిన్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాను నిర్మించిన తరువాత నిర్మాత రాజుకి”దిల్ రాజు” అనే పేరు వచ్చింది.

2) ఆర్య: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ఆర్య. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ముందుగా ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ను సంప్రదిస్తే ప్రేమ కథ చిత్రం కావడంతో ఎన్టీఆర్ ఇందులో నటించడానికి ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి.

3) భద్ర: వివి వినాయక్ దగ్గర పనిచేస్తున్న సమయంలో బోయపాటి శీను భద్ర కథ గురించి ముందుగా అల్లు అర్జున్ కి వినిపించారు.ఆ తర్వాత ఇదే కథను ఎన్టీఆర్ కు చెప్పగా ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ఎందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమాను రవితేజతో తీసి బ్లాక్ బాస్టర్ హిట్ ను సంపాదించాడు బోయపాటి శీను.

4) అతనొక్కడే: అతనొక్కడే సినిమా ద్వారా దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే సురేందర్ రెడ్డి ముందుగా ఈ కథను ఎన్టీఆర్ కి చెప్పగా,ఎన్టీఆర్ నో చెప్పడంతో ఆ అవకాశం కళ్యాణ్ రామ్ కు దక్కింది.

5) కిక్: అతిధి, అశోక్ లాంటి డిజాస్టర్ మూవీలను చూసిన సురేందర్ రెడ్డి కిక్ సినిమా కథతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఈ సినిమా కథను ఎన్టీఆర్ కి వినిపిస్తే ఎన్టీఆర్ ఈ సినిమాని వదులుకున్నాడు. ఆ తరువాత సురేందర్ రెడ్డి రవితేజ హీరోగా కిక్ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

6) కృష్ణ: వివి వినాయక్ కృష్ణ కథతో ఎన్టీఆర్ ను సంప్రదించగా ఎన్టీఆర్ ఈ కథకు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో వినాయక్ రవితేజ హీరోగా కృష్ణ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా రవితేజకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది.

7) శ్రీమంతుడు: ఎన్టీఆర్ బృందావనం సినిమా చేసే సమయంలో ఆయనతో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల కొరటాల శివ వెళ్లి శ్రీమంతుడు స్టోరీని ఎన్టీఆర్ కి చెప్పగా ఎన్టీఆర్ చేయలేదు. శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.

8) ఊపిరి : ఊపిరి సినిమాలో ముందుగా వంశీ పైడిపల్లి నాగార్జున ఎన్టీఆర్ హీరోలుగా అనుకున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున వీల్ చైర్ కు మాత్రమే పరిమితం అవుతారు. నాగార్జున కాళ్లు పట్టుకునే సన్నివేశాలు ఉండటంతో ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

9) రాజా ది గ్రేట్: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ ని అనుకున్నారట. అందుకు దిల్ రాజు కూడా ఓకే చెప్పారు కానీ చివరి నిమిషంలో ఎన్టీఆర్ కి బదులు రవితేజను హీరోగా ఈ సినిమాలో తీసుకున్నారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri