NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సండే స్పెషల్ స్టోరీ..! వచ్చేవారం హైలైట్ ట్విస్ట్ ఇదే.!

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది.. మంచి రేటింగ్ తో పాటు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. వీక్షకులను కావలసిన అన్ని ఎలిమెంట్స్ ను అన్ని కోణాలను సరియైన సమయంలో చూపిస్తూ.. టివిల ముందు నుంచి కడలనివ్వకుండా చేస్తుంది..! నిన్నటితో 566 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది..! వచ్చేవారం ఈ సీరియల్ లో ఏం జరగనుందో.. ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..!

Intinti Gruhalakshmi: 28 Feb 2022 Today 567 Episode Highlights
Intinti Gruhalakshmi: 28 Feb 2022 Today 567 Episode Highlights

గాయత్రి టీవీలో లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసి.. లాస్య కి ఫోన్ చేస్తుంది. మీ ఇంట్లో పిల్లి గుడ్లు పెట్టినా నాకు ఫోన్ చేసి చెప్తావు.. అలాంటిది ఇంత పెద్ద న్యూస్ జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది.. తులసి దీక్ష చేస్తున్న సంగతి నువ్వు చెప్పిన దాకా మాకు కూడా తెలీదు.. అసలు ఇంట్లో ఎవరికీ ఆ విషయం చెప్పలేదు కూడా అని లాస్య అనగానే.. ఇక నీకు తెలియనప్పుడు నీతో ఎందుకు మాట్లాడటం ఆ విషయం తేల్చుకుంటా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది.. కోపంతో గాయత్రీ తులసి దగ్గరికి బయలు దేరుతుంది. తులసి దగ్గరకు వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. తనకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది.. బాధలో ఉన్న తులసి కి అండగా నిలబడకుండా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నా కూతురు పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. అందుకు నువ్వే కారణమని తులసి నిలదీస్తుంది.. అభిని కాపాడి తీసుకురావాల్సిన బాధ్యత నీదేనని నా కూతురి జీవితం బాగుండాలంటే నువ్వే కాదు.. నేను కూడా ఏదో ఒకటి చేస్తానని తన ప్రయత్నం తాను చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. ఇక చేసేది ఏమీ లేక.. తులసి చేసేదే కరెక్ట్ అని వదిలేస్తుంది గాయత్రి. ఇక ఈ విషయం తెలుసుకొని అంకిత దగ్గరకు వెళ్లి మరో రాద్ధాంతం చేస్తుంది వాళ్ళ అమ్మ.. ఇంట్లో వాళ్లందరినీ ఈ విషయం మాకు ఎందుకు చెప్పలేదు అంటూ కడిగి పారేస్తుంది.. పనిలోపనిగా లాస్య నందు లకు నాలుగు చివాట్లు తగిలిస్తుంది..

Intinti Gruhalakshmi: 28 Feb 2022 Today 567 Episode Highlights
Intinti Gruhalakshmi: 28 Feb 2022 Today 567 Episode Highlights

గాయత్రి కూడా ఆ ఎస్ఐకి పై అధికారులతో ఫోన్ చేయిస్తుంది. తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అభీని బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఆ ఎస్ఐ సహనం కోల్పోయి అభి నా దగ్గరే ఉంటే నేను దొరికిపోతాడు అని.. అటు తులసి ఇటు గాయత్రి, నందు, తన పై అధికారులకు సమాధానం చెప్పుకోలేని అని ఆలోచిస్తూ ఉంటాడు. వీడి మీద ఎలా పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక ఆ ఎస్సై క్రిమినల్ బ్రెయిన్ లో మాస్టర్ బ్లాస్టర్ ఐడియా వస్తుంది. వీడిని బయటకు తీసుకు వెళ్లి వదిలేస్తున్నా అని చెప్పి పారిపోతుండగా.. షూట్ చేస్తా.. నా పగ తీరుతుంది.. బ్రతికి ఉంటే పోలీస్ స్టేషన్ కి.. లేదంటే పోస్టుమార్టం కి తీసుకు వెళ్తా అని మనసులో అనుకున్నాడు.. గురి మిస్ కాకుండా ఉంటే అభి పైకి పోతాడు నా పగ తీరిపోతుంది.. ఎవరైనా అడిగితే అభి ని పట్టుకునే ప్రయత్నంలో అభినీ కాల్చాలని .. అతడు చనిపోతాడని అనుకోలేదని పక్కాగా ప్లాన్ వేసుకుంటాడు ఆ ఎస్ఐ..

తన ప్లాన్ ప్రకారం.. ఆ ఎస్సై అభిని బయటకు తీసుకువస్తాడు. అభి ఎందుకు నన్ను బయటకు తీసుకువచ్చారు అని అడుగగా నేను కరిగిపోయాను.. నా కోపం తగ్గిపోయేలోపే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటాడు.. అభి ఎస్సై మనసులో ఉన్న కుట్ర తెలుసుకోకుండా .. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు అభి పరుగెత్తుతుండగా.. తన ప్లాన్ ను అమలు చేస్తాడు.. రివాల్వర్ తీసి అభి నీ కాల్చే ప్రయత్నం చేస్తాడు. అభి వెనకకు చూసుకోకుండా పరిగెత్తుతూ ఉంటాడు. ఎదురుగా రాళ్లు ఉండటంతో జారి కింద పడిపోతాడు. ఇక ఆ ఎస్సై షూట్ అభి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.

ఇక అభి కాపాడుకోవడానికి తులసి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. ఎస్సై తులసికి ఫోన్ చేసి అభిని చంపేస్తున్న అన్న విషయం చెబుతాడు. నీకు చేతనైతే దమ్ముంటే వచ్చి కాపాడు అని అంటాడు.. లేదంటే కానిస్టేబుల్స్ లో ఎవరైనా ఈ విషయాన్ని తులసి కి సీక్రెట్ గా చెప్పారు.. ఈ విషయం తెలుసుకున్న తులసి పరుగెత్తుకుంటూ అభి దగ్గరకు వస్తుంది. ఎలాగైనా తులసి అభినీ కాపాడుకుంటుంది. ఎస్ఐ గన్ గురితప్పేలా చేస్తుంది.. మొత్తానికి తులసి అభిని కాపాడి శభాష్ అనిపించుకుంటుంది.. అది ఎలా చిత్రీకరిస్తారో రేపటి భాగంలో తెలుసుకుందాం..

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju