పవన్ కల్యాణ్ ఎలా ఉన్నా అభిమానులు ఆయన్ని ఇష్టపడతారు. జానీ సమయంలో అయితే ఆయన ఏం చేస్తే అదే ఫ్యాషన్. ఈ మధ్య ఆయన గడ్డంతో, మధ్య పాపిడితో కొన్నాళ్లు అలరించారు. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వచ్చిన తర్వాత గడ్డాన్ని ట్రిమ్ చేయించారు. అయితే పూర్తిగా తీసి వేయకుండా స్టైలిష్‌గా ట్రిమ్ చేయించుకున్నారు. ఇటీవల ఓ పాపతో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటో నెట్టింట్లో తిరుగుతోంది. అందులో లుక్కు అదిరిపోయిందని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ లుక్‌తో ఓ సినిమాలో కనిపిస్తే బావుంటుందని కూడా సలహాలు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు కాస్త విరామంలో ఉన్నారు. ఆయన తదుపరి సినిమాల గురించి ఎలాంటి ప్రకటనా లేదు. రాజకీయాల పరంగానూ ఆయన స్టాండ్ ఏంటో ఇంకా వివరించాల్సి ఉంది. ఏదేమైనా పవన్ గడ్డం ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారింది.
previous post
next post