బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్, అతని తనయుడు ఆర్యన్ ఖాన్ ఒకే సినిమాకు కలిసి పని చేశారు. అదేంటి ఆర్యన్‌ఖాన్ ఇంకా తెరంగ్రేటమే చేయలేదు కదా! అనే సందేహం రాక మానదు. అయితే వీరిద్దరూ కలిసి వర్క్ చేసింది తెర వెనుకనే. వివరాల్లోకెళ్తే.. హాలీవుడ్ విజువల్ వండర్ `ద లయన్ కింగ్` సినిమా హిందీ వెర్షన్లో రాజు సింహ పాత్రధారి ముఫాసకు షారూక్ ఖాన్, సింబా పాత్రకు ఆర్యన్‌ఖాన్ డబ్బింగ్ చెప్పారట. వీరిద్దరూ ఇలా గాత్రాన్ని అందించడం ఇదేమీ కొత్తేమీ 2004లో `ది ఇన్క్రెడిబుల్` చిత్రానికి కూడా షారూక్, ఆర్యన్ డబ్బింగ్ చెప్పారు. 15 ఏళ్ల తర్వాత మరోసారి మరో అనువాద చిత్రానికి వీరిద్దరూ అనువాదం చెప్పడం విశేషం. `ద లయన్ కింగ్` పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూలై 19న విడుదల కానుంది.
previous post
next post