Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లలో ఒకరైన డైరెక్టర్ సుకుమార్.. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు సుక్కు.
చాలా వైవిధ్యంగా.. సరికొత్త తరహాలో బన్నీని సుకుమార్ చూపిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్ గా.. బన్నీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉన్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ తో చేస్తున్నట్లు చెప్పడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ బన్నీ తో అయిన వెంటనే రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు…. సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది.
దీంతో విజయ్ దేవరకొండ సినిమాని పక్కన పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగార్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. పూరి తో అయిన వెంటనే సుకుమార్ తో స్టార్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో.. విజయ్ దేవరకొండ సినిమాలు పక్కనబెట్టి చరణ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మరి సుకుమార్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనే టాక్ సినీ ప్రేక్షకుల నుండి వినిపిస్తుంది.