Janhvi Kapoor: జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నార్త్ తో పాటు సౌత్ సినీ ప్రియులకు కూడా జాన్వీ సుపరిచితమే. దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కూతురిగా గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో ధడక్ మూవీతో తన కెరీర్ ను ప్రారంభించింది. 2018 నుంచి ఇప్పటి వరకు అరడజన్కు పైగా చిత్రాల్లో నటించింది. తనదైన అందం, అభినయంతో 24 ఏళ్లకు భారీ సూపర్స్టార్డమ్ ను సంపాదించుకుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ తన ఫోకస్ ను సౌత్ ఇండస్ట్రీ వైపు మళ్లించింది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా దేవర మూవీకి సైన్ చేసింది. ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే ఆర్సీ 16లో హీరోయిన్ గా ఎంపిక అయింది. నేడు జాన్వీ కపూర్ బర్త్డే కావడంతో మేకర్స్ ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. సినిమాల గురించి పక్కన పెడితే.. బర్త్డే సందర్భంగా జాన్వీ కపూర్ గురించి సౌత్ లో ఎవరికీ తెలియన టాప్ సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జాన్వీ కపూర్ 1997 మార్చి 6న ముంబైలో జన్మించింది. అదే ఏడాది ఫిబ్రవరిలో బోనీ కపూర్ నిర్మాణంలో శ్రీదేవి మరియు అనిల్ కపూర్ నటించిన జుదాయి చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఊర్మిళ మటోండ్కర్ కూడా యాక్ట్ చేసింది. ఆమె పాత్ర పేరు జాన్వి. ఆ పేరు బోనీ కపూర్, శ్రీదేవిలకు బాగా నచ్చేయడంతో తమ మొదటి బిడ్డకు పెట్టుకున్నారట. అలాగే జాన్వీ కపూర్ ను డాక్టర్ గా చూడాలని శ్రీదేవి ఎంతగానో ఆశపడ్డారట. కానీ చిన్నతనం నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన జాన్వీ.. నటి కావాలని ఆశపడింది. అదే దిశగా అడుగులు వేసింది.
జాన్వీ కపూర్ కు యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆమె కథక్ నేర్చుకుంది. జాన్వీ కవితలు కూడా బాగా రాస్తుందట. అలాగే జాన్వీ కపూర్ కు ట్రావెలింగ్ అంటే అమితమైన ప్రేమ. ఉదయపూర్ మరియు ఫ్లోరెన్స్ ఆమెకు ఇష్టమైన హాలిడే డెస్టినేషన్స్. ఒకవేళ నటి కాకపోయంటే.. తన సమయాన్ని ట్రావెలింగ్ కు అంకితం చేసేదాన్నంటూ గతంలో జాన్వీ కపూర్ తెలిపింది. ఇక తిరుపతిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవడం అనేది జాన్వీ కపూర్ డ్రీమ్.