ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్2 ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్‌తేజ్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ వీరిద్దరూ కలిశారు. అంటే.. వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా ఉంటుందా? అనే సందేహం రావచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే.. పిల్లలను అమితంగా ఆకట్టుకున్న కార్టూన్ సీరియల్ అల్లాదీన్. ఇప్పుడు గాయ్ రిట్చయ్ దర్శకత్వంలో సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు మే 24న రానుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ జీనీగా నటిస్తుంటే.. అల్లాదీన్‌గా మేనా మసూద్ నటించాడు. యువరాణి జాస్మిన్‌గా నయోమి స్కాట్ నటించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదలవుతుంది. తెలుగులో జీనీ పాత్రకు వెంకటేష్.. అల్లాదీన్ పాత్రకు వరుణ్‌తేజ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. వీరిద్దరి కలయిక మరో ప్రేక్షకులను మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.
previous post
next post