NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ముద్ర‌గ‌డ వ‌స్తున్నారు స‌రే… జ‌గ‌న్‌కు తెచ్చే ఓట్లు చూస్తే షాకే…!

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. దాదాపు వైసీపీలోకి చేరిపోయిన‌ట్టే. కేవలం ముహూర్తం మాత్ర‌మే మిగిలి ఉంది. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు.. మీమాంస‌లు.. రాయ‌బారాలు అనంతరం ఆయ‌న ఫ్యాన్ కింద‌కు చేరిపోయారు. ఇది కొంత వ‌ర‌కు ముద్ర‌గ‌డ‌ను అభిమానించే వారికి క్లారిటీ ఇచ్చే సిన‌ట్టు అయిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ముద్ర‌గ‌డ ఏ పార్టీకి జై కొడ‌తారో తెలియ‌క నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళంలో చిక్కుకున్నారు. ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది.

అయితే.. అస‌లు క‌థ ఇక్క‌డే ఉంది. అస‌లు ముద్ర‌గ‌డ‌.. వైసీపీలో చేర‌డం.. ఆయ‌న‌కు ప్ల‌స్సా.. మైన‌స్సా? ఇది ఒక‌కోణం. మ‌రొక‌టి ముద్ర‌గ‌డ రాక‌తో వైసీపీకి వ‌చ్చే కొత్త ఓట్లెన్ని? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. నిన్న‌టి వ‌ర‌కు కూడా.. జ‌న‌సేన‌లో చేరేందుకు సిద్ధ‌మేన‌ని ఆయ‌న లీకులు ఇస్తూ వ‌చ్చారు. ప‌వ‌న్‌కు బ‌హిరంగ లేఖ‌లు కూడా రాశారు. అంతేకాదు.. ఇటీవ‌ల జెండా స‌భ అనంత‌రం కూడా.. టికెట్లు, కేటాయింపు.. అభ్య‌ర్థుల విష‌యంలో సీరియ‌స్ కామెంట్లు చేస్తూ హీటెక్కించారు.

దీంతో అయ్యో.. ముద్ర‌గ‌డ చెబుతున్న సూచ‌న‌లు కూడా జ‌న‌సేన తీసుకోవ‌డం లేదా? అనే చ‌ర్చ సాగింది . ముఖ్యంగా కాపుల్లో ఈ చ‌ర్చ జోరుగా సాగింది. అయితే.. ఈ చ‌ర్చ ఇలా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ముద్రగ‌డ అనూహ్యంగా వైసీపీ బాట ప‌ట్ట‌డంతో కాపులు స‌హా ఆయ‌న‌ను అభిమానించే వారు కూడా నివ్వెర‌పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు .. ప‌వ‌న్ సానుకూల‌.. జ‌న‌సేన అనుకూల ముసుగులు ధ‌రించి.. వైసీపీకి మేలు చేస్తున్నార న్న కొంద‌రు విమ‌ర్శ‌ల‌కు తాజాగా బ‌లం చేకూరిన‌ట్టు అయింది.

దీంతో వైసీపీలోకి ఆయ‌న వ‌చ్చినా.. తెచ్చే ఓట్ల‌పై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. దీనికి ముందు మాత్రం ముద్ర‌గడ రాక‌తో క‌నీసంలో క‌నీసం 50 వేల ఓట్లు వ‌స్తాయ‌ని వైసీపీ అంచ‌నా వేసుకుంది. కానీ, ఇప్పుడు మారిపోయింది. ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా వైసీపీకి మేలు చేస్తుందా..? లేదా? అనేది ప‌క్క‌న పెడితే. వ్య‌క్తిగ‌తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ముద్ర‌గ‌డ సంపాయించుకున్న ఇమేజ్‌, ముఖ్యంగా కాపుల్లోని ప‌లు సామాజిక వ‌ర్గాల్లో ఆయ‌న‌పై ఉన్న సాన‌కూల దృక్ఫ‌థం వంటివి మాత్రం మ‌స‌క‌బారేలా చేశాయి.

పార్టీల్లో చేరేందుకు ఆయ‌న‌కు ఎలాంటి అడ్డు ఎవ‌రూ చెప్ప‌లేదు. పెట్టలేదు కూడా. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సుదీర్ఘంగా త‌ట‌స్థ నేత‌గా ఉన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించి.. జ‌న‌సేన‌కు ఏదో మేలు చేస్తున్న‌ట్టు చెప్పి.. అనూహ్యంగా వైసీపీకి జై కొట్ట‌డం.. వ్య‌క్తిగ‌తంగా ముద్ర‌గ‌డ‌కు.. డేంజ‌ర్ బెల్స్ మొగిస్తున్న‌ట్టేన‌ని..ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త‌కు ఇది పెను ప్ర‌మాద‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీంతో ఈ ప‌రిణామం వైసీపీపైనా భారీగా ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju