NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయటానికి అసలు గుట్టు బయటపెట్టిన నాదెండ్ల మనోహర్..!!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే.

Nadendla Manohar reveals the biggest reason why Pawan kalyan is making movies again .. !!
Nadendla Manohar reveals the biggest reason why Pawan kalyan is making movies again .. !!

సినిమారంగంలోకి మళ్లీ వెళ్లే ఆలోచన లేదని చివరి కట్టె కాలే అంతవరకు ప్రజా సమస్యలపై పోరాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని, వెనక్కి తిరిగి చూసేది లేదని పెద్ద పెద్ద డైలాగులు వేశారు. తీరా ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన క్రమంలో ప్రత్యర్థులు “పవన్ ప్యాకప్ సినిమాలకు మేకప్” అనే తరహా లో డైలాగులు వేయటం జరిగింది. ఆ టైంలో పవన్ బయటకు వచ్చి…నా శవాన్ని నలుగురు మోసే అంతవరకు పార్టీని విడిచి లేదని, సినిమాలు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. కానీ సరిగ్గా గత ఏడాది ప్రారంభంలో ఎవరూ ఊహించని విధంగా పవన్ మళ్లీ సినిమాలు చేయడం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ క్రమంలో తనను తాను సమర్ధించుకుంటూ చాలా మంది రాజకీయ నాయకులు ఒక పక్క వ్యాపారాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలు చేస్తున్నారు అలాంటప్పుడు తాను సినిమాలు చేస్తే తప్పేంటి అని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటూ ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా పవన్ సినిమా రంగంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా జనసేన పార్టీకి చెందిన కీలక నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సినిమా రిఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు…తమ్ముడికి అండగా ఉండటానికి రంగంలోకి దిగుతున్నట్లు మనోహర్ వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. ఇలాంటో తరుణంలో అసలు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయడానికి కారణం చిరంజీవే అని అసలు గుట్టు తాజాగా బయటపెట్టారు. అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ రాణించే సత్తా పవన్ కి ఉంది అని… ఆ మేరకు అన్న చిరంజీవి సలహా మేరకే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ రెండోసారి సినిమాలు చేయడానికి గల కారణం చిరంజీవే అన్న విషయాన్ని తెలుసుకుని మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమారంగంలో బిజీగా ఉన్న సమయంలో పార్టీని చిరంజీవి ముందుండి నడిపించే రీతిలో జనసేన పార్టీ చిరంజీవితో సరికొత్త స్ట్రాటజీ వేసినట్లు అర్థమవుతోంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N