Nani : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన హీరోలలో ఒకరు న్యాచురల్ స్టార్ నాని. “అష్టా చమ్మా” సినిమాతో ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని అనతికాలంలోనే అన్ని రకాల సినిమాలు చేస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని అదేవిధంగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిలో తనదైన శైలిలో బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.
ఒక హీరోగా మాత్రమే కాక నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టి నాని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్యామ్ సింగరాయి, టక్ జగదీష్ అనే సినిమాలు చేస్తున్నాడు నాని. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ కథలతో తెరకెక్కుతున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాలు కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ రెండు సినిమాలకు సంబంధించి మోషన్ పోస్టర్ రేపు రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ వున్నట్లు అదే రీతిలో నాని పుట్టినరోజు నాడు అనగా ఫిబ్రవరి 24 వ తారీకు రోజు శ్యామ్ సింగరాయి, టక్ జగదీష్ రెండు సినిమాలకు సంబంధించి టీజర్ లు రిలీజ్ చేసి అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వటానికి నాని రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!