బ్రేకింగ్: దీపికా, శ్రద్ధ సహా రకుల్, సారాలకు సమన్లు జారీ చేసిన నార్కోటిక్స్ అధికారులు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం సీబీఐ చేతికి వెళ్లినప్పటి నుండి కేసులు సరికొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూడడంతో నార్కోటిక్స్ అధికారులు రంగంలోకి దిగారు.

 

NCB summons to shraddha deepika sara ali khan and rakul preet singh in bollywood drugs scandal
NCB summons to shraddha deepika sara ali khan and rakul preet singh in bollywood drugs scandal

 

సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె చెప్పిన పేర్ల ఆధారంగా ఇప్పుడు నార్కోటిక్స్ బృందం సమన్లు జారీ చేసింది. లోనవాలాలోని తన ఫామ్ హౌస్ లో సుశాంత్, రియా, శ్రద్ధ, దీపికా, రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాలు పార్టీలలో తరచూ హాజరయ్యేవారని తెలిసింది. ఆ పార్టీలో డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. ఇప్పుడు నార్కోటిక్స్ అధికారులు సారా, దీపికా, రకుల్, శ్రద్ధలను విచారించనున్నారు.